గ్రీన్ అంబాసిడర్లకు రెయిన్కోట్లు పంపిణీ
పున్నమి ప్రతినిధి ఆనంద్ ( అనకాపల్లి జిల్లా బ్యూరో)
ఏటికొప్పాక గ్రామంలో బుధవారం స్వర్ణ గ్రామ సచివాలయంలో పారిశుధ్య సేవలు అందిస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు రెయిన్కోట్లు పంపిణీ చేశారు. వర్షాకాలంలో ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా గ్రామ పరిశుభ్రత కోసం విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం చేపట్టారు. వర్షంలో తడవకుండా విధులు నిర్వహించేందుకు రెయిన్కోట్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కే. గిరి ప్రసాదరావు, మాజీ సర్పంచ్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు అన్నం బాబ్జి, మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి, సర్పంచ్ కుమారుడు బజంత్రీలు శ్రీను పాల్గొన్నారు. పంచాయతీ సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్లు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. గ్రామ పరిశుభ్రత కోసం నిరంతరం సేవలందిస్తున్న కార్మికులను అభినందించారు. వర్షాలు, ప్రతికూల పరిస్థితుల్లోనూ పారిశుధ్య సేవలకు ఆటంకం కలగకుండా అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.


