ఖమ్మం జిల్లా కోర్టు ఎదుట బుధవారం న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. న్యాయవాదుల డెత్, రిటైర్మెంట్ బెనిఫిట్‌ను రూ.25 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే న్యాయవాదులకు వైద్య సహాయం కింద రూ.5 లక్షలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10 వేల చొప్పున ఐదేళ్ల పాటు స్టైఫండ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ధర్నాలో ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు, పలువురు న్యాయవాదులు పాల్గొని తమ డిమాండ్లను వెల్లడించారు.



