Tuesday, 22 September 2026
  • Home  
  • పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులే బలం.. ఏటికొప్పాకలో ఎస్‌ఎంసీ ఎన్నికలు..!!
- అనకాపల్లి

పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులే బలం.. ఏటికొప్పాకలో ఎస్‌ఎంసీ ఎన్నికలు..!!

ఎలమంచిలి : పున్నమి ప్రతినిధి ఆనంద్ ఏటికొప్పాక ప్రాథమిక పాఠశాలలో నూతన పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈ నెల 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక, 2 గంటలకు ప్రమాణ స్వీకారం, 3 గంటలకు తొలి ఎస్‌ఎంసీ సమావేశం నిర్వహించనున్నట్లు పాఠశాల ఉపాధ్యాయ బృందం తెలిపింది. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల మౌలిక వసతులు, విద్యా ప్రమాణాల మెరుగుదలకు తమ వంతు సహకారం అందించాలనుకునే తల్లిదండ్రులు ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలని కోరుతున్నారు. నూతన మార్గదర్శకాల ప్రకారం కమిటీలో 75 శాతం మంది తల్లిదండ్రులు ఉండేలా, 50 శాతం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించేలా నిబంధనలు ఉన్నాయి. పాఠశాల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా పనిచేసే వ్యక్తులు కమిటీలో భాగస్వాములు కావడం ద్వారా పాఠశాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

ఎలమంచిలి : పున్నమి ప్రతినిధి ఆనంద్

ఏటికొప్పాక ప్రాథమిక పాఠశాలలో నూతన పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈ నెల 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక, 2 గంటలకు ప్రమాణ స్వీకారం, 3 గంటలకు తొలి ఎస్‌ఎంసీ సమావేశం నిర్వహించనున్నట్లు పాఠశాల ఉపాధ్యాయ బృందం తెలిపింది.
పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల మౌలిక వసతులు, విద్యా ప్రమాణాల మెరుగుదలకు తమ వంతు సహకారం అందించాలనుకునే తల్లిదండ్రులు ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలని కోరుతున్నారు. నూతన మార్గదర్శకాల ప్రకారం కమిటీలో 75 శాతం మంది తల్లిదండ్రులు ఉండేలా, 50 శాతం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించేలా నిబంధనలు ఉన్నాయి. పాఠశాల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా పనిచేసే వ్యక్తులు కమిటీలో భాగస్వాములు కావడం ద్వారా పాఠశాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.