అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమకుమారి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. “పరిశుభ్రత మన బాధ్యత–పచ్చదనం మనందరి బాధ్యత” అనే సందేశంతో విద్యార్థినులకు అవగాహన కల్పించారు. కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటి, స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కళాశాల పరిసరాల్లో అవగాహన ర్యాలీ నిర్వహించి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంపై ప్రజలకు సందేశాలు అందించారు. స్వచ్ఛమైన కళాశాల, పచ్చని పరిసరాలే ఆరోగ్యకర సమాజానికి పునాది అని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పీవో డా. సి.హెచ్. మురళీకృష్ణ, సభ్యులు డా. బి. సుభాన్, డా. కె. లక్ష్మీ, కె. అఖిల్తేజ, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు.



