కొండాపురం: ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కొండాపురం మండల కేంద్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల కన్వీనర్ పోలిలేని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
అనంతరం కొండాపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


