డుంబ్రిగుడ మండలం కొల్లాపుట్టు పంచాయితీ పరిధిలోని బొడ్లమామిడి, నిట్టమామిడి, డొకిరిపాడు గ్రామాలకు కలుపుతున్న రోడ్డు పనులు సంవత్సరాలు గడుస్తున్నా పూర్తికాక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏళ్ల క్రితమే రోడ్డుకు మెటల్ వేశారు. కానీ తారు వేయకపోవడంతో వర్షాలకు మెటల్ రాళ్లు, కింద మట్టి కొట్టుకుపోయింది. ప్రస్తుతం రోడ్డుపై రాళ్లు తేలి ఘాటీ ప్రాంతంలో వాహనాలు నడపడం దుర్భరంగా మారింది. గర్భిణీలు, వృద్ధులు, విద్యార్థులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్, 108 వాహనాలు సైతం గ్రామాలకు చేరలేని పరిస్థితి. రోడ్డును వెంటనే పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.


