Sunday, 20 September 2026
  • Home  
  • ఐదు గ్రామాల్లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
- తిరుపతి

ఐదు గ్రామాల్లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

– ఐదుగురు లబ్ధిదారులకు రూ.3.57 లక్షల ఆర్థిక సాయం ఓబులవారిపల్లి మండలంలోని ఐదు గ్రామాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. హైలరాచపల్లి, యల్లాయపల్లి, మంగంపేట, ఎద్దులవారిపల్లి, చిన్నంపల్లి గ్రామాలకు చెందిన ఐదుగురు లబ్ధిదారులకు మొత్తం రూ.3,57,140 విలువైన చెక్కులను వారి నివాసాల వద్ద అందజేశారు. హైలరాచపల్లికి చెందిన దాసరి సుబ్బరామయ్యకు రూ.34,341, యల్లాయపల్లికి చెందిన పర్ల శంకరయ్యకు రూ.33,185, మంగంపేటకు చెందిన పాలగిరి అశోక్‌కుమార్‌కు రూ.1,10,009, ఎద్దులవారిపల్లికి చెందిన అలం చంద్రయ్యకు రూ.1,49,405, చిన్నంపల్లికి చెందిన వంకిరాజు చంగమ్మకు రూ.30,200 చొప్పున సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందాయి. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి లబ్ధిదారుల ఇళ్ల వద్ద చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

– ఐదుగురు లబ్ధిదారులకు రూ.3.57 లక్షల ఆర్థిక సాయం

ఓబులవారిపల్లి మండలంలోని ఐదు గ్రామాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. హైలరాచపల్లి, యల్లాయపల్లి, మంగంపేట, ఎద్దులవారిపల్లి, చిన్నంపల్లి గ్రామాలకు చెందిన ఐదుగురు లబ్ధిదారులకు మొత్తం రూ.3,57,140 విలువైన చెక్కులను వారి నివాసాల వద్ద అందజేశారు. హైలరాచపల్లికి చెందిన దాసరి సుబ్బరామయ్యకు రూ.34,341, యల్లాయపల్లికి చెందిన పర్ల శంకరయ్యకు రూ.33,185, మంగంపేటకు చెందిన పాలగిరి అశోక్‌కుమార్‌కు రూ.1,10,009, ఎద్దులవారిపల్లికి చెందిన అలం చంద్రయ్యకు రూ.1,49,405, చిన్నంపల్లికి చెందిన వంకిరాజు చంగమ్మకు రూ.30,200 చొప్పున సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందాయి. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి లబ్ధిదారుల ఇళ్ల వద్ద చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.