Thursday, 17 September 2026
  • Home  
  • బిక్కవోలు లక్ష్మీ గణపతికి 150 కేజీల లడ్డూ సమర్పణ
- తూర్పు గోదావరి

బిక్కవోలు లక్ష్మీ గణపతికి 150 కేజీల లడ్డూ సమర్పణ

అనపర్తి, సెప్టెంబర్ 16 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలులోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో వినాయక చవితి నవ రాత్రుల మహోత్సవం సందర్భంగా గణపతికి 150 కేజీల భారీ లడ్డూను సమర్పించారు. కోటపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దేశిన సత్యనారాయణ (నల్లబ్బాయి) మరియు వారి కుటుంబ సభ్యులు ఈ లడ్డూను స్వామివారికి సమర్పించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి–మహాలక్ష్మి దంపతులు, అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి–సుమేఘ దంపతుల చేతుల మీదుగా లడ్డూను గణపతికి సమర్పించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళా నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

అనపర్తి, సెప్టెంబర్ 16 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలులోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో వినాయక చవితి నవ రాత్రుల మహోత్సవం సందర్భంగా గణపతికి 150 కేజీల భారీ లడ్డూను సమర్పించారు. కోటపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దేశిన సత్యనారాయణ (నల్లబ్బాయి) మరియు వారి కుటుంబ సభ్యులు ఈ లడ్డూను స్వామివారికి సమర్పించారు.

అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి–మహాలక్ష్మి దంపతులు, అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి–సుమేఘ దంపతుల చేతుల మీదుగా లడ్డూను గణపతికి సమర్పించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళా నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.