Thursday, 17 September 2026
  • Home  
  • వెంకటాయపాలెంలో పౌష్టికాహార వారోత్సవాలు
- ప్రకాశం

వెంకటాయపాలెంలో పౌష్టికాహార వారోత్సవాలు

టంగుటూరు: టంగుటూరు ప్రాజెక్టులోని సీడీపీఓ వై. అంజమ్మ అనుమతితో సూపర్‌వైజర్ బి. సుచరిత ఆధ్వర్యంలో టంగుటూరు సెక్టార్‌ వెంకటాయపాలెం అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. అలాగే పిల్లలకు అందించే బాలామృతం గురించి తల్లులకు వివరించారు. కార్యక్రమంలో వెంకటాయపాలెం అంగన్వాడీ కార్యకర్త వెంకటరమణమ్మ, రావివారిపాలెం అంగన్వాడీ కార్యకర్త లక్ష్మి, వెంకటాయపాలెం ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయులు వెంకటస్వామి, తల్లులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.