Saturday, 19 September 2026
  • Home  
  • విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో ఇంజనీర్లు ముందుకు సాగాలి: నల్లమిల్లి
- తూర్పు గోదావరి

విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో ఇంజనీర్లు ముందుకు సాగాలి: నల్లమిల్లి

అనపర్తి, సెప్టెంబర్ 15 (పున్నమి ప్రతినిధి): భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా అనపర్తిలో ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన ఎస్‌ఈలు, ఈఈలు, డీఈలు, ఏఈలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యేను ఇంజనీర్లు సత్కరించారు. యువ ఇంజనీర్లకు విశ్వేశ్వరయ్య జీవితం, సేవలు స్ఫూర్తిగా నిలవాలన్నారు. ఆధునిక భారత నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర కీలకమని, వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భాగస్వాములు కావాలని నల్లమిల్లి పిలుపునిచ్చారు. Uploaded Video:

అనపర్తి, సెప్టెంబర్ 15 (పున్నమి ప్రతినిధి): భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా అనపర్తిలో ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన ఎస్‌ఈలు, ఈఈలు, డీఈలు, ఏఈలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యేను ఇంజనీర్లు సత్కరించారు. యువ ఇంజనీర్లకు విశ్వేశ్వరయ్య జీవితం, సేవలు స్ఫూర్తిగా నిలవాలన్నారు. ఆధునిక భారత నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర కీలకమని, వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భాగస్వాములు కావాలని నల్లమిల్లి పిలుపునిచ్చారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.