Tuesday, 15 September 2026
  • Home  
  • రామ్‌నగర్‌లో ఘనంగా శ్రీ ఏకదంతుడి మహోత్సవం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రామ్‌నగర్‌లో ఘనంగా శ్రీ ఏకదంతుడి మహోత్సవం

-రామ్‌నగర్‌లో ఘనంగా అన్నదానం -శ్రీ ఏకదంత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నగరంలోని రామ్‌నగర్, ఉస్మాన్‌సాహెబ్‌పేటలో శ్రీ ఏకదంత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం వినాయక చవితి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని అన్నదాత గంగపట్నం సాయితేజ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన వినాయకుడి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. రామ్‌నగర్, ఉస్మాన్‌సాహెబ్‌పేటతోపాటు ఏసీ నగర్, బాలాజీనగర్, ఎన్టీఆర్ నగర్, వేపదొరువు తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గణనాథుడిని దర్శించుకున్నారు. నిర్వాహకులు భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమానికి కిన్నెర ప్రేమ్‌కుమార్, పర్వతరెడ్డి రాణాప్రతాప్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వారు భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, **‘అన్నదానం మహాదానం’** అనే స్ఫూర్తితో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమ విజయానికి సహకరించిన అన్నదాతలు, అతిథులు, భక్తులు, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఏకదంత ఉత్సవ కమిటీ సభ్యులు ప్రభు, ప్రవీణ్, కోటి, సురేష్, చిన్ని, సోను, హరి, నాని, సుధీర్, అజయ్, అజ్జు, కౌశిక్, యోగి, సాజిద్, దేవేంద్ర, కిశోర్, రవి, రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

-రామ్‌నగర్‌లో ఘనంగా అన్నదానం
-శ్రీ ఏకదంత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
నగరంలోని రామ్‌నగర్, ఉస్మాన్‌సాహెబ్‌పేటలో శ్రీ ఏకదంత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం వినాయక చవితి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని అన్నదాత గంగపట్నం సాయితేజ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.

ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన వినాయకుడి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. రామ్‌నగర్, ఉస్మాన్‌సాహెబ్‌పేటతోపాటు ఏసీ నగర్, బాలాజీనగర్, ఎన్టీఆర్ నగర్, వేపదొరువు తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గణనాథుడిని దర్శించుకున్నారు. నిర్వాహకులు భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు.
కార్యక్రమానికి కిన్నెర ప్రేమ్‌కుమార్, పర్వతరెడ్డి రాణాప్రతాప్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వారు భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, **‘అన్నదానం మహాదానం’** అనే స్ఫూర్తితో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమ విజయానికి సహకరించిన అన్నదాతలు, అతిథులు, భక్తులు, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ ఏకదంత ఉత్సవ కమిటీ సభ్యులు ప్రభు, ప్రవీణ్, కోటి, సురేష్, చిన్ని, సోను, హరి, నాని, సుధీర్, అజయ్, అజ్జు, కౌశిక్, యోగి, సాజిద్, దేవేంద్ర, కిశోర్, రవి, రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.