పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 19. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో గ్రామ సహాయకులు గా పనిచేయుచున్న వీఆర్ఏలు నాలుగు రోజులుగా పి గన్నవరం మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద తమ హక్కుల కొరకు జీతభత్యాలు పెంచమని రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు రిలే నిరాహార దీక్ష సమ్మె చేయుచున్నారు. మమత స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డా. కోరుకొండ జాన్ వీఆర్ఏల నిరాహార దీక్ష శిబిరమును సందర్శించి వీఆర్వోల సమస్యలను ప్రభుత్వము పరిష్కరించి న్యాయం చేయాలని. పెరుగుతున్న నిత్యవసర ధరలు పిల్లలు చదువులు కుటుంబ భారంతో సతమతమవుతూ అతి తక్కువ జీతంతో పనిచేయుచున్న వీఆర్ఏలకు సంఘీభావం తెలియజేసి తక్షణమే ప్రభుత్వం స్పందించి వారి డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి తెలియజేశారు ఈ సందర్భంగా వీఆర్ఏలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని చేశారు


