బిక్కవోలు, సెప్టెంబరు 14 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో వినాయక చవితిని పురస్కరించుకుని నవ రాత్రుల మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో కలశ స్థాపన కార్యక్రమాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి–మహాలక్ష్మి దంపతులు నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.
అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి–సుమేఘ దంపతులు కూడా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఆలయ పరిసరాల్లో భక్తిశ్రద్ధలతో ఉత్సవ వాతావరణం నెలకొంది.




