ఎదో, ఫ్రెండ్స్ బలవంతం చేస్తే, సరదాగా రాసానే కానీ, పరీక్ష రాయాలని రాయలేదు. మిమ్మల్ని చూడకుండా, మిమ్మల్ని వదిలి, దూరంగా రెండేళ్లు, ఆమ్మో నా వళ్ళ కాదు, వెళ్ళను, మీ దగ్గరే వుంటాను ” – అమెరికా ms గేట్ పరీక్షలో ర్యాంక్ లో పాస్ అయిన పాతికేళ్ళ కొడుకు, కుమార్ అమ్మ, నాన్న తో అన్నాడు.
” నిన్ను వదిలి మేము మాత్రం ఉండగలమా! కానీ బంధం బాధ్యతకు అడ్డురాకూడదు, వీడేమో కాల్ ఉందిగా ” 70 ఏళ్ల తండ్రి సాంబయ్య
” అమెరికా లో సీట్ రావటమే గొప్ప! మా కొడుకు అమెరికా అని పది మంది ముందు చెప్పుకోవాలిగా!, నువ్వు వెళ్లాల్సిందే, వెళ్లకపోతే, నా మీద ఒట్టే! 65 ఏళ్ల తల్లి దుర్గ.
కొడుకును ఒప్పించి, ఇల్లు, నగలు, బ్యాంకు లో కుదువ పెట్టి డబ్బు తెచ్చి, అమెరికా పంపారు. ఇష్టం లేక పోయిన, కాదనలేక వెళ్ళాడు. కొద్దిరోజులు డైలీ వీడేమో కాల్ చేసేవాడు. తర్వాత వారానికి ఒకసారి, నెలకోసారి చేసేవాడు.
దుర్గ ఆరోగ్యం చెడింది. రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. వారానికి రెండు సార్లు డయాలిసిస్ చేయాలి అన్నారు డాక్టర్లు.
రిటైర్డ్ టీచర్ పాతిక వేల పెన్షన్ లో అప్పు కటింగ్స్ పొగ, వచ్చే పది వేల రూపాయల డబ్బు తో ఇల్లు గడవటమే కష్టం గా వున్న సాంబయ్య కు డయాలిసిస్ ఖర్చు భారమైపోయింది.
బావమరిది నంది తో ” ఆరోగ్యశ్రీ కార్డు లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, బ్యాంకు బ్యాలెన్స్ లేదు, అమెరికా కొడుకు తండ్రిగా ప్రభుత్వ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇప్పించను నామోషీ, ఇరుగు పోరుగు ఏమనుకుంటారేమో!
కార్పొరేట్ వైద్యం చేయించే స్థోమత లేదు ” ఎం చేయాలి బాధపడుతూ, ఎలాగూ తీర్చే అప్పుకాదు, వడ్డీ పెరగటం తప్ప, ఇల్లు అమ్మేసి, బ్యాంకు బాకీ తీర్చేసి మిగిలిన డబ్బు తో వైద్యం చేయిస్తాను అంటాడు. అది విన్న దుర్గ ఇల్లు అమ్మితే, ఉండను నీడ ఉండదు, నగలు అమ్మేసి, బాకీ తీర్చేసి, మిగిలిన దాంట్లో వైద్యం చేయించండి, ఈలోగా నా కొడుకు వస్తాడు, వైద్యం చేయిస్తాడు అంటుంది.
కొడుక్కు ఫోన్ చేయచ్చుకదా అంటే వాడు వెళ్ళింది చదువుకోను, ఉద్యోగం చేయను కాదు, వద్దు అంటాడు సాంబయ్య.
నగలు అమ్మిన డబ్బు తో అరునెలలు డయాలిసిస్ చేయిస్తారు. చదువు అయిపోయిన ఫోన్ లేదు కొడుకు దగ్గర నుంచి. భార్య
మంగళసూత్రం అమ్మి వైద్యం చేయించాలని నిర్ణయించి, పసుపు తాడు కట్టెందుకు సిద్ధమవుతుండగా కొడుకు దగ్గర్నుంచి ఫోన్ వస్తుంది తాను వస్తున్నట్టు.
కొడుకు వచ్చాడు. అమ్మ, నాన్న ను చూసి ఏంటి ఇలా చిక్కిపోయారు అంటాడు. ఆరిపోయేందుకు సిద్ధంగా వున్న దీపాలం మేము అంటుంది తల్లి. మీ దీపాలు ఆరిపోకుండ నేను చమురు అవుతాను అంటాడు. అయితే అమెరికా మళ్ళీ వెళ్ళవా! అంటుంది తల్లి. ఎందుకు, నేను వెళ్ళింది చదువుకోను, నా చదువు నా దేశానికి,నా శరీరం మీకు సేవ చేసేందుకు ఉపయోగపడాలి, అంటాడు.
ఇక్కడ నీకు వచ్చే డబ్బుతో ఇల్లు గడవాలి, మీ అమ్మకు వైద్యం, చేయించాలి, ఇక అప్పు తీరేది ఎప్పుడు, తప్పు నీది కాదు,అప్పు చేసి నిన్ను చదివించిన మీ అమ్మ, నాన్నది తప్పు అంటాడు మేనమామ నంది. మా తప్పు కూడ వుంది మామయ్య! అమెరికా లో చదుకువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ, ఆ డబ్బు తో ఫుడ్, షెల్టర్ తో పాటు, అప్పు తీర్చేందుకు ఇంటికి డబ్బు పంపించాలి అన్న మైండ్ సెట్ తప్పు, ఎందుకంటే స్టూడెంట్ వీసా చదువుకోను మాత్రమే ఇస్తారు. కాంపెస్ బయట ఉద్యోగం చేయటం నేరం, అలాంటి పరిస్థితిలో వెళ్ళక పోవటమే మంచిది. నేను కూడ చాలా స్ట్రగల్ అయ్యాను. మా ఫ్రెండ్ హెల్ప్ చేసాడు. ఇద్దరం ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ లో రోబోటిక్ సహాయం తో వైద్య రంగం, రక్షణ రంగం, డ్రోన్ ద్వారా వ్యవసాయ రంగానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్ కనుక్కున్నాం. దాన్ని అమ్మితే డబ్బు తో పాటు ఉద్యోగం ఇస్తామని ఫారిన్ కంపెనీలు ముందుకొచ్చాయి, వాటిని కాదని, మన ప్రభుత్వాన్ని సంప్రదిస్తే ప్రోత్సాహం ఇస్తామన్నారు. ఇక్కడే కంపెనీ స్టార్టప్ లో స్టార్ట్ చేసాం. నేను మేనేజంగ్ డైరెక్టర్. రిచ్ గా కాకపోయినా, నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను.
లేదు, నాకు అమెరికా కొడుకు స్టేటస్ కావాలి అంటే, నీకు నగలు కొనిస్త, బాకీ తీర్చేసి ఇల్లు విడిపిస్తా, కార్పొరేట్ వైద్యం చేయిస్తా, కాకపోతే నేను నీకు దగ్గరగా ఉండలేను, ఈ ఫిసికల్ టచ్ ఉండదు, చెప్పు నీకు నేను కావాలా!
నా డబ్బు కావాలా!అంటాడు
డబ్బు ఉంటే దేవుడే మన హ్యాండ్ బాగు లో ఉన్నట్టు, మనిషి దగ్గర లేకపోతే ఎం ఆన్లైన్ లో మీకు కావలిసిన వన్ని ఇంటి గుమ్మం వద్దకే వస్తాయి, అక్కయ్య కు చెప్పు బావ అంటాడు.
చెప్పటానికి వాడు అడ్డాలనాటి బిడ్డ కాదయ్య! చిన్నప్పుడు బడి కి వెళ్లనని, మోరాయించిన వీడు, ఒక్కో మెట్టు ఎక్కి పై మెట్టుకి చేరాడు. అక్కడ నించి చూస్తే ప్రపంచం వీడి కింద ఉన్నట్టు కనపడుతుంది, ఒక్క చదువు లోనే కాదు, విలువల్లో కూడ పైన వున్నాడు. అలాంటి వాడు
దేశం. కోసం మా కోసం డాలర్లని, స్టేటస్, ని గడ్డి పరకల కాదని వచ్చి, నా చేయి పట్టుకోండి అంటున్నాడు.
నువ్వేమో వాడి చేయి కాదు, వాడి చేతిలో వుండే డబ్బు అందుకోండి అంటున్నావు. డబ్బు కోసం కాకపోయినా, వాడి చేయి పట్టుకుంటే ఇక్కడే ఆగిపోతాడు. చేయి వదిలేస్తే, ఒక ఓరి దత్తాత్రేయ లాగో, సుందర్ పిచాయి లాగో ప్రపంచానికి చెంది సేవ చేస్తాడు, దేశం ప్రతిష్ట పెంచుతాడు
ఎం కావాలి అని భార్యని అడిగాడు.
వాడు వెళ్ళటమే మంచిది, వెళితే, కొడుకు చంపలు నిమురుతూ, ముద్దు పెట్టుకుని, చేయి గట్టిగ పట్టుకుని, ఈ టచ్ మిస్ అవుతాను అంది బాధగా
ఈ టచ్ వెలకట్టలేని సంపద, ఇది అమూల్యం ఇది నాకు కావాలి, దీన్ని దూరం చేసేది ఏమి నాకు వద్దు అని పెద్దగా ఏడుస్తూ అమ్మ నాన్న కాళ్ళ మీద పడ్డాడు.కొడుకు కుమార్. దగ్గరకు తీసుకుని కన్నీరు తుడిచారు అమ్మ, నాన్న.
మనవాడు జీవితం అనే పరీక్ష లో కూడ నెగ్గాడు
డబ్బు పోతే మళ్ళీ వస్తుంది, బంధం పోతే ఎంత ఏడ్చినా రాదు,
వున్నప్పుడే కాపాడుకోవాలి అది అమూల్యం అన్నాడు నంది.
సమాప్తం
రచన : జిబికే మూర్తి
9948093608

డబ్బుకంటే విలువైన ఆ స్పర్శ : కుటుంబ కధ : జిబికే మూర్తి
ఎదో, ఫ్రెండ్స్ బలవంతం చేస్తే, సరదాగా రాసానే కానీ, పరీక్ష రాయాలని రాయలేదు. మిమ్మల్ని చూడకుండా, మిమ్మల్ని వదిలి, దూరంగా రెండేళ్లు, ఆమ్మో నా వళ్ళ కాదు, వెళ్ళను, మీ దగ్గరే వుంటాను ” – అమెరికా ms గేట్ పరీక్షలో ర్యాంక్ లో పాస్ అయిన పాతికేళ్ళ కొడుకు, కుమార్ అమ్మ, నాన్న తో అన్నాడు. ” నిన్ను వదిలి మేము మాత్రం ఉండగలమా! కానీ బంధం బాధ్యతకు అడ్డురాకూడదు, వీడేమో కాల్ ఉందిగా ” 70 ఏళ్ల తండ్రి సాంబయ్య ” అమెరికా లో సీట్ రావటమే గొప్ప! మా కొడుకు అమెరికా అని పది మంది ముందు చెప్పుకోవాలిగా!, నువ్వు వెళ్లాల్సిందే, వెళ్లకపోతే, నా మీద ఒట్టే! 65 ఏళ్ల తల్లి దుర్గ. కొడుకును ఒప్పించి, ఇల్లు, నగలు, బ్యాంకు లో కుదువ పెట్టి డబ్బు తెచ్చి, అమెరికా పంపారు. ఇష్టం లేక పోయిన, కాదనలేక వెళ్ళాడు. కొద్దిరోజులు డైలీ వీడేమో కాల్ చేసేవాడు. తర్వాత వారానికి ఒకసారి, నెలకోసారి చేసేవాడు. దుర్గ ఆరోగ్యం చెడింది. రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. వారానికి రెండు సార్లు డయాలిసిస్ చేయాలి అన్నారు డాక్టర్లు. రిటైర్డ్ టీచర్ పాతిక వేల పెన్షన్ లో అప్పు కటింగ్స్ పొగ, వచ్చే పది వేల రూపాయల డబ్బు తో ఇల్లు గడవటమే కష్టం గా వున్న సాంబయ్య కు డయాలిసిస్ ఖర్చు భారమైపోయింది. బావమరిది నంది తో ” ఆరోగ్యశ్రీ కార్డు లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, బ్యాంకు బ్యాలెన్స్ లేదు, అమెరికా కొడుకు తండ్రిగా ప్రభుత్వ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇప్పించను నామోషీ, ఇరుగు పోరుగు ఏమనుకుంటారేమో! కార్పొరేట్ వైద్యం చేయించే స్థోమత లేదు ” ఎం చేయాలి బాధపడుతూ, ఎలాగూ తీర్చే అప్పుకాదు, వడ్డీ పెరగటం తప్ప, ఇల్లు అమ్మేసి, బ్యాంకు బాకీ తీర్చేసి మిగిలిన డబ్బు తో వైద్యం చేయిస్తాను అంటాడు. అది విన్న దుర్గ ఇల్లు అమ్మితే, ఉండను నీడ ఉండదు, నగలు అమ్మేసి, బాకీ తీర్చేసి, మిగిలిన దాంట్లో వైద్యం చేయించండి, ఈలోగా నా కొడుకు వస్తాడు, వైద్యం చేయిస్తాడు అంటుంది. కొడుక్కు ఫోన్ చేయచ్చుకదా అంటే వాడు వెళ్ళింది చదువుకోను, ఉద్యోగం చేయను కాదు, వద్దు అంటాడు సాంబయ్య. నగలు అమ్మిన డబ్బు తో అరునెలలు డయాలిసిస్ చేయిస్తారు. చదువు అయిపోయిన ఫోన్ లేదు కొడుకు దగ్గర నుంచి. భార్య మంగళసూత్రం అమ్మి వైద్యం చేయించాలని నిర్ణయించి, పసుపు తాడు కట్టెందుకు సిద్ధమవుతుండగా కొడుకు దగ్గర్నుంచి ఫోన్ వస్తుంది తాను వస్తున్నట్టు. కొడుకు వచ్చాడు. అమ్మ, నాన్న ను చూసి ఏంటి ఇలా చిక్కిపోయారు అంటాడు. ఆరిపోయేందుకు సిద్ధంగా వున్న దీపాలం మేము అంటుంది తల్లి. మీ దీపాలు ఆరిపోకుండ నేను చమురు అవుతాను అంటాడు. అయితే అమెరికా మళ్ళీ వెళ్ళవా! అంటుంది తల్లి. ఎందుకు, నేను వెళ్ళింది చదువుకోను, నా చదువు నా దేశానికి,నా శరీరం మీకు సేవ చేసేందుకు ఉపయోగపడాలి, అంటాడు. ఇక్కడ నీకు వచ్చే డబ్బుతో ఇల్లు గడవాలి, మీ అమ్మకు వైద్యం, చేయించాలి, ఇక అప్పు తీరేది ఎప్పుడు, తప్పు నీది కాదు,అప్పు చేసి నిన్ను చదివించిన మీ అమ్మ, నాన్నది తప్పు అంటాడు మేనమామ నంది. మా తప్పు కూడ వుంది మామయ్య! అమెరికా లో చదుకువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ, ఆ డబ్బు తో ఫుడ్, షెల్టర్ తో పాటు, అప్పు తీర్చేందుకు ఇంటికి డబ్బు పంపించాలి అన్న మైండ్ సెట్ తప్పు, ఎందుకంటే స్టూడెంట్ వీసా చదువుకోను మాత్రమే ఇస్తారు. కాంపెస్ బయట ఉద్యోగం చేయటం నేరం, అలాంటి పరిస్థితిలో వెళ్ళక పోవటమే మంచిది. నేను కూడ చాలా స్ట్రగల్ అయ్యాను. మా ఫ్రెండ్ హెల్ప్ చేసాడు. ఇద్దరం ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ లో రోబోటిక్ సహాయం తో వైద్య రంగం, రక్షణ రంగం, డ్రోన్ ద్వారా వ్యవసాయ రంగానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్ కనుక్కున్నాం. దాన్ని అమ్మితే డబ్బు తో పాటు ఉద్యోగం ఇస్తామని ఫారిన్ కంపెనీలు ముందుకొచ్చాయి, వాటిని కాదని, మన ప్రభుత్వాన్ని సంప్రదిస్తే ప్రోత్సాహం ఇస్తామన్నారు. ఇక్కడే కంపెనీ స్టార్టప్ లో స్టార్ట్ చేసాం. నేను మేనేజంగ్ డైరెక్టర్. రిచ్ గా కాకపోయినా, నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను. లేదు, నాకు అమెరికా కొడుకు స్టేటస్ కావాలి అంటే, నీకు నగలు కొనిస్త, బాకీ తీర్చేసి ఇల్లు విడిపిస్తా, కార్పొరేట్ వైద్యం చేయిస్తా, కాకపోతే నేను నీకు దగ్గరగా ఉండలేను, ఈ ఫిసికల్ టచ్ ఉండదు, చెప్పు నీకు నేను కావాలా! నా డబ్బు కావాలా!అంటాడు డబ్బు ఉంటే దేవుడే మన హ్యాండ్ బాగు లో ఉన్నట్టు, మనిషి దగ్గర లేకపోతే ఎం ఆన్లైన్ లో మీకు కావలిసిన వన్ని ఇంటి గుమ్మం వద్దకే వస్తాయి, అక్కయ్య కు చెప్పు బావ అంటాడు. చెప్పటానికి వాడు అడ్డాలనాటి బిడ్డ కాదయ్య! చిన్నప్పుడు బడి కి వెళ్లనని, మోరాయించిన వీడు, ఒక్కో మెట్టు ఎక్కి పై మెట్టుకి చేరాడు. అక్కడ నించి చూస్తే ప్రపంచం వీడి కింద ఉన్నట్టు కనపడుతుంది, ఒక్క చదువు లోనే కాదు, విలువల్లో కూడ పైన వున్నాడు. అలాంటి వాడు దేశం. కోసం మా కోసం డాలర్లని, స్టేటస్, ని గడ్డి పరకల కాదని వచ్చి, నా చేయి పట్టుకోండి అంటున్నాడు. నువ్వేమో వాడి చేయి కాదు, వాడి చేతిలో వుండే డబ్బు అందుకోండి అంటున్నావు. డబ్బు కోసం కాకపోయినా, వాడి చేయి పట్టుకుంటే ఇక్కడే ఆగిపోతాడు. చేయి వదిలేస్తే, ఒక ఓరి దత్తాత్రేయ లాగో, సుందర్ పిచాయి లాగో ప్రపంచానికి చెంది సేవ చేస్తాడు, దేశం ప్రతిష్ట పెంచుతాడు ఎం కావాలి అని భార్యని అడిగాడు. వాడు వెళ్ళటమే మంచిది, వెళితే, కొడుకు చంపలు నిమురుతూ, ముద్దు పెట్టుకుని, చేయి గట్టిగ పట్టుకుని, ఈ టచ్ మిస్ అవుతాను అంది బాధగా ఈ టచ్ వెలకట్టలేని సంపద, ఇది అమూల్యం ఇది నాకు కావాలి, దీన్ని దూరం చేసేది ఏమి నాకు వద్దు అని పెద్దగా ఏడుస్తూ అమ్మ నాన్న కాళ్ళ మీద పడ్డాడు.కొడుకు కుమార్. దగ్గరకు తీసుకుని కన్నీరు తుడిచారు అమ్మ, నాన్న. మనవాడు జీవితం అనే పరీక్ష లో కూడ నెగ్గాడు డబ్బు పోతే మళ్ళీ వస్తుంది, బంధం పోతే ఎంత ఏడ్చినా రాదు, వున్నప్పుడే కాపాడుకోవాలి అది అమూల్యం అన్నాడు నంది. సమాప్తం రచన : జిబికే మూర్తి 9948093608

