పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ :
అనకాపల్లి: గత రెండు సంవత్సరాలుగా ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం, స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో కొత్త విధానాలు, సామాజిక కార్యక్రమాల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు ఆరోపించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ 82, 83 వార్డు అధ్యక్షులు అల్లా త్రినాథ్, బుద్ధ భాస్కరరావు ఆధ్వర్యంలో ఉడ్పేట సచివాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలు, నివాసాలు, నిత్యావసరాలపై సరైన సమాచారం అందించడం లేదని ఆరోపించారు.
బాధ్యత కలిగిన ప్రభుత్వ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు కృషి చేస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


