పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్
అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం. వెంకట నారాయణ స్పూర్తి జూనియర్ కళాశాల విద్యార్థులతో పాటు నూకాలమ్మ ఆర్చ్ వద్ద వాహనదారులకు పలు సూచనలు చేశారు.హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలు, సిగ్నల్స్‌ను పాటించకపోవడం, అతివేగంగా వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. నూకాలమ్మ ఆర్చ్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ ఏర్పాటు చేసినందున వాహనదారులు తప్పనిసరిగా సిగ్నల్ నిబంధనలు పాటించాలని సూచించారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని ఇన్స్పెక్టర్ ఎం. వెంకట నారాయణ తెలిపారు.

