Friday, 26 June 2026
  • Home  
  • ప్రతి బూత్ కమిటీ క్రియాశీలంగా పనిచేయాలి: గంటా*
- ఆంధ్రప్రదేశ్

ప్రతి బూత్ కమిటీ క్రియాశీలంగా పనిచేయాలి: గంటా*

నియోజకవర్గంలోని 361 బూత్ కమిటీలు క్రియాశీలంగా పనిచేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సమాచారాన్ని సకాలంలో అప్ లోడ్ చేయని 280 కమిటీలు నిస్తేజంగా ఉన్నట్టే భావించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎంవీపీ కాలనీ క్యాంప్ ఆఫీస్ లో శుక్రవారం పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 81 బూత్ కమిటీలు మాత్రమే చురుకుగా పనిచేస్తున్నాయని పేర్కొంటూ రాబోయే రోజుల్లో ప్రతి బూత్ కమిటీ చైతన్యం కావాలన్నారు. ప్రతి శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ముఖ్య నాయకులతో పార్టీ సమావేశం విధిగా నిర్వహిస్తామని వెల్లడించారు. 12 క్లస్టర్ల నుంచి కన్వీనర్లు, కో కన్వీనర్లు వరుసగా మూడు సమావేశాలకు హాజరుకాని పక్షంలో అనర్హులవుతారని హెచ్చరించారు. *జాబ్ మేళాతో యువతకు మేలు* జాబ్ మేళాలతో యువతకు ఎంతో మేలు జరుగుతుందని గంటా పేర్కొన్నారు. ఈనెల 30 న పీఎం పాలెం సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే భీమిలి మెగా జాబ్ మేళా – 2026 లో వివిధ రంగాలకు చెందిన 70కి పైగా పేరొందిన కంపెనీలు హాజరవుతాయని తెలిపారు. ఉద్యోగ అవకాశం కల్పిస్తున్న విషయం గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని కోరారు. ప్రస్తుతానికి నమోదు చేసుకున్న 1,500 యువత సంఖ్య జాబ్ మేళా నాటికి 5 వేలకు పైగా చేరుకుంటుందని చెప్పారు. జాబ్ మేళా విజయవంతం కావడానికి సచివాలయాల్లో పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నామన్నారు. *ఎస్.ఐ.ఆర్. ను సవాల్ గా తీసుకోవాలి* ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్.) ను కార్యకర్తలు సవాల్ గా తీసుకోవాలని.. అర్హత గల ఒక్క ఓటు పోవడానికి వీల్లేదని, అదే సమయంలో బోగస్ ఓట్లు ఉండకూడదని ఎమ్మెల్యే గంటా స్పష్టం చేశారు. తమిళనాడులో ఒక్క ఓటు ఎమ్మెల్యే భవితవ్యం మార్చిన విషయం గుర్తుంచుకోవాలని తెలియజేశారు. దొంగ ఓట్లను కాపాడుకోవడానికి వైసీపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బూత్ లెవెల్ ఏజెంట్లు (బి.ఎల్.ఎ.) ఇంకా 280 బూత్ లలో క్రియాశీలకం కాలేదన్నారు. రాబోయే ప్రతి ఎన్నికల్లోనూ ప్రత్యేక సమగ్ర సవరణ కీలకం కానుందని, దీనిపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టిని ఉంచాలని సూచించారు. బి.ఎల్.ఓ.లు ఉదయం 10 గంటలకు వచ్చేసరికి, కూలీ చేసుకునే వారు పనుల్లోకి వెళ్లిపోతున్నారని సాయంత్రం 5 గంటలకు ఇళ్లకు చేరుకునే సమయానికి బి.ఎల్.ఓ.లు విధులు ముగించుకుని వెళ్ళిపోతున్నారని కొందరు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చిక్కాల విజయ్ బాబు, సరగడ అప్పారావు, కసిరెడ్డి దామోదరరావు, మొల్లి లక్ష్మణరావు, కోరాడ రమణ, కాళ్ల నగేష్ కుమార్, మన్యాల సోంబాబు, గాడు చిన్ని కుమారి లక్ష్మి, గంటా నూకరాజు, లొడగల అప్పారావు, నాగోతి సత్యనారాయణ, కానూరు అచ్యుతరావు, కాకర్లపూడి శ్రీకాంత్ రాజు, గరే గుర్నాథ్, పంచదార్ల శ్రీనివాస్, మామిడి దుర్గారావు, రామరాజు, లొడగల జానకిరామ్, మజ్జి నందీష్, దండి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గంలోని 361 బూత్ కమిటీలు క్రియాశీలంగా పనిచేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సమాచారాన్ని సకాలంలో అప్ లోడ్ చేయని 280 కమిటీలు నిస్తేజంగా ఉన్నట్టే భావించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎంవీపీ కాలనీ క్యాంప్ ఆఫీస్ లో శుక్రవారం పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 81 బూత్ కమిటీలు మాత్రమే చురుకుగా పనిచేస్తున్నాయని పేర్కొంటూ రాబోయే రోజుల్లో ప్రతి బూత్ కమిటీ చైతన్యం కావాలన్నారు. ప్రతి శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ముఖ్య నాయకులతో పార్టీ సమావేశం విధిగా నిర్వహిస్తామని వెల్లడించారు. 12 క్లస్టర్ల నుంచి కన్వీనర్లు, కో కన్వీనర్లు వరుసగా మూడు సమావేశాలకు హాజరుకాని పక్షంలో అనర్హులవుతారని హెచ్చరించారు.

*జాబ్ మేళాతో యువతకు మేలు*

జాబ్ మేళాలతో యువతకు ఎంతో మేలు జరుగుతుందని గంటా పేర్కొన్నారు. ఈనెల 30 న పీఎం పాలెం సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే భీమిలి మెగా జాబ్ మేళా – 2026 లో వివిధ రంగాలకు చెందిన 70కి పైగా పేరొందిన కంపెనీలు హాజరవుతాయని తెలిపారు. ఉద్యోగ అవకాశం కల్పిస్తున్న విషయం గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని కోరారు. ప్రస్తుతానికి నమోదు చేసుకున్న 1,500 యువత సంఖ్య జాబ్ మేళా నాటికి 5 వేలకు పైగా చేరుకుంటుందని చెప్పారు. జాబ్ మేళా విజయవంతం కావడానికి సచివాలయాల్లో పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నామన్నారు.

*ఎస్.ఐ.ఆర్. ను సవాల్ గా తీసుకోవాలి*

ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్.) ను కార్యకర్తలు సవాల్ గా తీసుకోవాలని.. అర్హత గల ఒక్క ఓటు పోవడానికి వీల్లేదని, అదే సమయంలో బోగస్ ఓట్లు ఉండకూడదని ఎమ్మెల్యే గంటా స్పష్టం చేశారు. తమిళనాడులో ఒక్క ఓటు ఎమ్మెల్యే భవితవ్యం మార్చిన విషయం గుర్తుంచుకోవాలని తెలియజేశారు. దొంగ ఓట్లను కాపాడుకోవడానికి వైసీపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బూత్ లెవెల్ ఏజెంట్లు (బి.ఎల్.ఎ.) ఇంకా 280 బూత్ లలో క్రియాశీలకం కాలేదన్నారు. రాబోయే ప్రతి ఎన్నికల్లోనూ ప్రత్యేక సమగ్ర సవరణ కీలకం కానుందని, దీనిపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టిని ఉంచాలని సూచించారు. బి.ఎల్.ఓ.లు ఉదయం 10 గంటలకు వచ్చేసరికి, కూలీ చేసుకునే వారు పనుల్లోకి వెళ్లిపోతున్నారని సాయంత్రం 5 గంటలకు ఇళ్లకు చేరుకునే సమయానికి బి.ఎల్.ఓ.లు విధులు ముగించుకుని వెళ్ళిపోతున్నారని కొందరు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చిక్కాల విజయ్ బాబు, సరగడ అప్పారావు, కసిరెడ్డి దామోదరరావు, మొల్లి లక్ష్మణరావు, కోరాడ రమణ, కాళ్ల నగేష్ కుమార్, మన్యాల సోంబాబు, గాడు చిన్ని కుమారి లక్ష్మి, గంటా నూకరాజు, లొడగల అప్పారావు, నాగోతి సత్యనారాయణ, కానూరు అచ్యుతరావు, కాకర్లపూడి శ్రీకాంత్ రాజు, గరే గుర్నాథ్, పంచదార్ల శ్రీనివాస్, మామిడి దుర్గారావు, రామరాజు, లొడగల జానకిరామ్, మజ్జి నందీష్, దండి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.