Thursday, 13 August 2026
  • Home  
  • చర్చి నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని ఆర్‌డీఓకు వినతి
- మేడ్చల్ – మల్కాజిగిరి

చర్చి నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని ఆర్‌డీఓకు వినతి

మేడ్చల్ (పున్నమి న్యూస్ ప్రతినిధి – సందీప్): ​అహ్మద్‌గూడ డబుల్ బెడ్‌రూమ్ కాలనీకి చెందిన క్రిస్టియన్ కమ్యూనిటీ ప్రతినిధులు మేడ్చల్ ఆర్‌డీఓ నల్ల వెంకటరెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ​కాలనీలోని క్రైస్తవ కుటుంబాలు ప్రార్థనలు చేసుకోవడానికి అనువుగా చర్చి నిర్మాణానికి కొంత స్థలాన్ని కేటాయించాలని ఈ సందర్భంగా వారు ఆర్‌డీఓను కోరారు. స్థానిక ప్రజల ప్రార్థనల అవసరాల కోసం స్థలం అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వివరించారు. ​వినతిపత్రం స్వీకరించిన ఆర్‌డీఓ నల్ల వెంకటరెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత తహసీల్దార్ (ఎమ్‌ఆర్‌ఓ)కు ఆదేశాలు జారీ చేశారు. స్థలాన్ని పరిశీలించి, సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.

మేడ్చల్ (పున్నమి న్యూస్ ప్రతినిధి – సందీప్):
​అహ్మద్‌గూడ డబుల్ బెడ్‌రూమ్ కాలనీకి చెందిన క్రిస్టియన్ కమ్యూనిటీ ప్రతినిధులు మేడ్చల్ ఆర్‌డీఓ నల్ల వెంకటరెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.
​కాలనీలోని క్రైస్తవ కుటుంబాలు ప్రార్థనలు చేసుకోవడానికి అనువుగా చర్చి నిర్మాణానికి కొంత స్థలాన్ని కేటాయించాలని ఈ సందర్భంగా వారు ఆర్‌డీఓను కోరారు. స్థానిక ప్రజల ప్రార్థనల అవసరాల కోసం స్థలం అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వివరించారు.
​వినతిపత్రం స్వీకరించిన ఆర్‌డీఓ నల్ల వెంకటరెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత తహసీల్దార్ (ఎమ్‌ఆర్‌ఓ)కు ఆదేశాలు జారీ చేశారు. స్థలాన్ని పరిశీలించి, సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.