Thursday, 14 May 2026
  • Home  
  • ఆత్మకూరు యూపీహెచ్‌సీ లో హ్యాండ్ హోల్డ్ ఎక్స్‌రే పరీక్షలు విజయవంతం
- E-పేపర్ - News - ఆంధ్రప్రదేశ్ - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు యూపీహెచ్‌సీ లో హ్యాండ్ హోల్డ్ ఎక్స్‌రే పరీక్షలు విజయవంతం

ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): టీబీ ముక్త భారత్ 2.0 కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు పరిధిలోని అరుంధతివాడలో హ్యాండ్ హోల్డ్ ఎక్స్‌రే పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి మరియు అడిషనల్ డీఎంహెచ్‌వో ఖాదరవల్లి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమం డాక్టర్ ముష్కర్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ప్రజలకు క్షయవ్యాధి (టీబీ)పై అవగాహన కల్పించారు. టీబీ లక్షణాలు, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. హ్యాండ్ హోల్డ్ ఎక్స్‌రే సాంకేతికత ద్వారా ప్రజలకు వేగంగా, సులభంగా పరీక్షలు నిర్వహించగా స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై పరీక్షలు చేయించుకున్నారు.కార్యక్రమంలో హెచ్‌ఈఓ శ్రీ ఎస్. సుధాకర్, హెచ్‌వీ పార్వతి, హెల్త్ అసిస్టెంట్ రవీందర్ రెడ్డి, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు మరియు యూపీహెచ్‌సీ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.టీబీ నిర్మూలనలో ప్రజల సహకారం ఎంతో అవసరమని, దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్య సిబ్బంది సూచించారు.

ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):

టీబీ ముక్త భారత్ 2.0 కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు పరిధిలోని అరుంధతివాడలో హ్యాండ్ హోల్డ్ ఎక్స్‌రే పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి మరియు అడిషనల్ డీఎంహెచ్‌వో ఖాదరవల్లి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమం డాక్టర్ ముష్కర్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ప్రజలకు క్షయవ్యాధి (టీబీ)పై అవగాహన కల్పించారు. టీబీ లక్షణాలు, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. హ్యాండ్ హోల్డ్ ఎక్స్‌రే సాంకేతికత ద్వారా ప్రజలకు వేగంగా, సులభంగా పరీక్షలు నిర్వహించగా స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై పరీక్షలు చేయించుకున్నారు.కార్యక్రమంలో హెచ్‌ఈఓ శ్రీ ఎస్. సుధాకర్, హెచ్‌వీ పార్వతి, హెల్త్ అసిస్టెంట్ రవీందర్ రెడ్డి, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు మరియు యూపీహెచ్‌సీ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.టీబీ నిర్మూలనలో ప్రజల సహకారం ఎంతో అవసరమని, దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్య సిబ్బంది సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.