Wednesday, 9 September 2026
  • Home  
  • మైలవరం లక్ష్మీ నరసింహ కళ్యాణ మండపం ప్రారంభం ఎమ్మెల్యే సొంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు
- ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం లక్ష్మీ నరసింహ కళ్యాణ మండపం ప్రారంభం ఎమ్మెల్యే సొంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు

మైలవరంలో లక్ష్మీ నరసింహ కళ్యాణ మండపం ప్రారంభం. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, సెప్టెంబర్ 9: ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ, సుమారు 700 సంవత్సరాల చరిత్ర కలిగిన మైలవరం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం సుకృతమన్నారు. స్వామివారి ఆశీస్సులు కూటమి ప్రభుత్వంపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. దేవాదాయ శాఖను నిర్వహించే బాధ్యతను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తనకు అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి తెలిపారు. సుదీర్ఘ రాజకీయ, పరిపాలనా అనుభవం కలిగిన చంద్రబాబు వంటి నాయకుడి వద్ద పనిచేయడం మహద్భాగ్యమన్నారు. పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కల్పించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి తనకు ఈ బాధ్యత అప్పగించారని చెప్పారు. రాష్ట్రంలో ఆధ్యాత్మికతను మరింత పెంపొందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కామన్ వెల్త్ ఫండ్‌ కీలకమైనదని తెలిపారు. దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయాల పునర్నిర్మాణానికి వినియోగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పుణ్యక్షేత్రాల్లో సుమారు 700 ఆలయాల పునర్నిర్మాణానికి కోట్లాది రూపాయల నిధులు కేటాయించి టెండర్లు పిలిచామని వెల్లడించారు. దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాల కోసం గతంలో ఇస్తున్న రూ.2 వేల మొత్తాన్ని చంద్రబాబు ప్రభుత్వం రూ.10 వేలకు పెంచిందన్నారు. ఏజెన్సీ, గిరిజన, అటవీ ప్రాంతాల్లో కూడా ఆలయాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ‘నిజం గెలిచింది’ కార్యక్రమం ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు అన్నారు. మూడు సంవత్సరాల క్రితం నంద్యాల పర్యటనలో చంద్రబాబు గారిని దౌర్జన్యంగా నిర్బంధించి అరెస్టు చేశారని, అనంతరం 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచారని ఆరోపించారు. చంద్రబాబే శంకుస్థాపన చేసిన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయనను ఉంచి అప్పటి ప్రభుత్వం పైశాచిక ఆనందాన్ని పొందిందని విమర్శించారు. బ్రిటీష్ వారు కూడా ఇంత నీచంగా, క్రూరంగా ప్రవర్తించలేదని మంత్రి వ్యాఖ్యానించారు. ఆ క్రూరత్వాన్ని ఎదురించి నిజాయితీగా నిలబడి, ప్రజల మద్దతుతో చంద్రబాబు గారి నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారని తెలిపారు. చంద్రబాబు గారు నిర్దోషి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న చంద్రబాబుకు సంఘీభావంగా ‘నిజం గెలిచింది’ కార్యక్రమంలో భాగంగా 53 దీపాలను ప్రతి ఇల్లు, కార్యాలయంలో వెలిగించి కూటమి నేతలు నిలబడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు పునర్నిర్మాణానికి ప్రజలు సహకరించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కోరారు.

మైలవరంలో లక్ష్మీ నరసింహ కళ్యాణ మండపం ప్రారంభం.

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, సెప్టెంబర్ 9:

ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ, సుమారు 700 సంవత్సరాల చరిత్ర కలిగిన మైలవరం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం సుకృతమన్నారు. స్వామివారి ఆశీస్సులు కూటమి ప్రభుత్వంపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు.

దేవాదాయ శాఖను నిర్వహించే బాధ్యతను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తనకు అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి తెలిపారు. సుదీర్ఘ రాజకీయ, పరిపాలనా అనుభవం కలిగిన చంద్రబాబు వంటి నాయకుడి వద్ద పనిచేయడం మహద్భాగ్యమన్నారు. పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కల్పించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి తనకు ఈ బాధ్యత అప్పగించారని చెప్పారు.

రాష్ట్రంలో ఆధ్యాత్మికతను మరింత పెంపొందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కామన్ వెల్త్ ఫండ్‌ కీలకమైనదని తెలిపారు. దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయాల పునర్నిర్మాణానికి వినియోగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా పుణ్యక్షేత్రాల్లో సుమారు 700 ఆలయాల పునర్నిర్మాణానికి కోట్లాది రూపాయల నిధులు కేటాయించి టెండర్లు పిలిచామని వెల్లడించారు. దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాల కోసం గతంలో ఇస్తున్న రూ.2 వేల మొత్తాన్ని చంద్రబాబు ప్రభుత్వం రూ.10 వేలకు పెంచిందన్నారు. ఏజెన్సీ, గిరిజన, అటవీ ప్రాంతాల్లో కూడా ఆలయాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

‘నిజం గెలిచింది’ కార్యక్రమం

‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు అన్నారు. మూడు సంవత్సరాల క్రితం నంద్యాల పర్యటనలో చంద్రబాబు గారిని దౌర్జన్యంగా నిర్బంధించి అరెస్టు చేశారని, అనంతరం 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచారని ఆరోపించారు. చంద్రబాబే శంకుస్థాపన చేసిన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయనను ఉంచి అప్పటి ప్రభుత్వం పైశాచిక ఆనందాన్ని పొందిందని విమర్శించారు.

బ్రిటీష్ వారు కూడా ఇంత నీచంగా, క్రూరంగా ప్రవర్తించలేదని మంత్రి వ్యాఖ్యానించారు. ఆ క్రూరత్వాన్ని ఎదురించి నిజాయితీగా నిలబడి, ప్రజల మద్దతుతో చంద్రబాబు గారి నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారని తెలిపారు.

చంద్రబాబు గారు నిర్దోషి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న చంద్రబాబుకు సంఘీభావంగా ‘నిజం గెలిచింది’ కార్యక్రమంలో భాగంగా 53 దీపాలను ప్రతి ఇల్లు, కార్యాలయంలో వెలిగించి కూటమి నేతలు నిలబడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు పునర్నిర్మాణానికి ప్రజలు సహకరించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.