పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ :
యలమంచిలి : పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తపేటలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై.వి. రమణ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా భారత మాజీ రాష్ట్రపతి, తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి విగ్రహానికి ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒకరికొకరు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వై.వి. రమణ మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనదని, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శాలను విద్యార్థులు పుణికిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు ఉపాధ్యాయ దినోత్సవ విశిష్టతను, గురువుల ప్రాధాన్యతను సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మంగపతి, కుందూరు రాజు, చంద్రశేఖర్, శ్రీనివాసరావు, అమరావతి, కోదండ రామలక్ష్మితో పాటు ఇతర ఉపాధ్యాయ బృందం, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.


