అనకాపల్లి పట్టణం, సెప్టెంబర్ 5: పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్
జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, IPS గారి ఆదేశాల మేరకు, అనకాపల్లి పట్టణ సీఐ జి.ప్రేమ కుమార్ గారి పర్యవేక్షణలో, ఎస్ఐ ఎ.వెంకటేశ్వరరావు మరియు వారి సిబ్బంది ప్రత్యేక గాలింపు చేపట్టి వాహనాల చోరీకి పాల్పడుతున్న నిందితుడిని చాకచక్యంగా అరెస్ట్ చేశారు.
నిందితుడి వివరాలు:
కోట్ల నారాయణ @ నీరజ్ (19 సం॥), తండ్రి: శ్రీనివాసరావు, స్వస్థలం: పిల్లవారి వీధి, చోడవరం. ప్రస్తుతం అనకాపల్లి పట్టణంలోని గొల్ల వీధిలో నివాసం ఉంటున్నాడు.
విశ్వసనీయ సమాచారం మేరకు 05.09.2026 మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో అనకాపల్లి NTR మార్కెట్ యార్డ్ వద్ద మూసివున్న దుకాణం సమీపంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు గతంలో పట్టణ పరిధిలో రెండు ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు అంగీకరించాడు.
స్వాధీనం చేసుకున్న వాహనాలు:
02.08.2026న నెయ్యల వీధికి చెందిన బేతా ప్రసాద్ బాబు గారి ఇంటి ముందు పార్క్ చేసిన నలుపు రంగు హోండా CB యునికార్న్ (AP 31 DX 5429).26.08.2026న కొత్తూరు గ్రామానికి చెందిన మట్టపర్తి హేమంత్ గారికి చెందిన నలుపు రంగు హోండా లివో (AP 31 DG 1709).
నిందితుడి నుంచి పై రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, చట్టపరమైన ప్రక్రియ అనంతరం న్యాయస్థానం ఎదుట హాజరుపరచడం జరిగింది. కేసును త్వరితగతిన ఛేదించి నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన అనకాపల్లి టౌన్ ఎస్ఐ శ్రీ ఎ.వెంకటేశ్వరరావు మరియు సిబ్బంది పిసిలు ఎం.సముద్రం, ఆర్.పి.నాయుడు , టి.ఎస్.నాయుడు లను జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, IPS గారు ప్రత్యేకంగా అభినందించారు.


