Sunday, 6 September 2026
  • Home  
  • గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ఎమ్మెల్యే మద్దిపాటి పాదయాత్ర
- తూర్పు గోదావరి

గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ఎమ్మెల్యే మద్దిపాటి పాదయాత్ర

తిమ్మాపురం, సెప్టెంబరు 5 (పున్నమి ప్రతినిధి): గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యంగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు చేపట్టిన **“గ్రామ స్వరాజ్యం–సంకల్ప పాదయాత్ర”**కు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంఘీభావం తెలిపారు. నల్లజర్ల నుంచి ద్వారకా తిరుమల వరకు కొనసాగుతున్న పాదయాత్రలో భాగంగా గోపాలపురం నియోజకవర్గంలోని తిమ్మాపురం చేరుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మద్దిపాటి వెంకటరాజును కలిసి యాత్రకు మద్దతు ప్రకటించారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల సమగ్ర ప్రగతి కోసం చేపట్టిన ఈ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని నాయకులు తెలిపారు. గ్రామ స్వరాజ్య సాధన దిశగా ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్న మద్దిపాటి వెంకటరాజుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభినందనలు తెలిపారు. Uploaded Video:

తిమ్మాపురం, సెప్టెంబరు 5 (పున్నమి ప్రతినిధి): గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యంగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు చేపట్టిన **“గ్రామ స్వరాజ్యం–సంకల్ప పాదయాత్ర”**కు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంఘీభావం తెలిపారు. నల్లజర్ల నుంచి ద్వారకా తిరుమల వరకు కొనసాగుతున్న పాదయాత్రలో భాగంగా గోపాలపురం నియోజకవర్గంలోని తిమ్మాపురం చేరుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మద్దిపాటి వెంకటరాజును కలిసి యాత్రకు మద్దతు ప్రకటించారు.

గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల సమగ్ర ప్రగతి కోసం చేపట్టిన ఈ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని నాయకులు తెలిపారు. గ్రామ స్వరాజ్య సాధన దిశగా ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్న మద్దిపాటి వెంకటరాజుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభినందనలు తెలిపారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.