అనపర్తి, సెప్టెంబర్ 5 (పున్నమి ప్రతినిధి):
అనపర్తి ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ స్టోరేజ్ యూనిట్, ఆర్ఓ ప్లాంట్‌ను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు గణనీయంగా మెరుగుపడ్డాయని, రోజుకు 400 నుంచి 500 మంది రోగులకు సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలో ఐపిహెచ్ఎల్ ల్యాబ్ అందుబాటులోకి వస్తే 165 రకాల పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వైద్యులు, సిబ్బంది సేవలను అభినందిస్తూ ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నూతన సూపరింటెండెంట్ డాక్టర్ పద్మశ్రీకి శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతి పొందిన డాక్టర్ రామాగుర్రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో హెచ్‌డీఎస్ సభ్యులు, కూటమి నాయకులు, వైద్యులు, సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనపర్తి ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలకు మరింత బలం
అనపర్తి, సెప్టెంబర్ 5 (పున్నమి ప్రతినిధి): అనపర్తి ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ స్టోరేజ్ యూనిట్, ఆర్ఓ ప్లాంట్‌ను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు గణనీయంగా మెరుగుపడ్డాయని, రోజుకు 400 నుంచి 500 మంది రోగులకు సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలో ఐపిహెచ్ఎల్ ల్యాబ్ అందుబాటులోకి వస్తే 165 రకాల పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వైద్యులు, సిబ్బంది సేవలను అభినందిస్తూ ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నూతన సూపరింటెండెంట్ డాక్టర్ పద్మశ్రీకి శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతి పొందిన డాక్టర్ రామాగుర్రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో హెచ్‌డీఎస్ సభ్యులు, కూటమి నాయకులు, వైద్యులు, సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు.

