సెప్టెంబర్ 05 2026
అంబేద్కర్ కోనసీమ జిల్లా.. దిండి–చించినాడ బ్రిడ్జిపై శనివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. తణుకు పట్టణానికి చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు గోదావరిలోకి దూకినట్లు సమాచారం.
వీరిని నంబూరి శ్రీనివాస్, ఆయన భార్య పద్మిని, కుమారుడు, కుమార్తెగా గుర్తించారు.
ఈ ఘటనలో శ్రీనివాస్ భార్య పద్మినిని స్థానిక మత్స్యకారులు సురక్షితంగా రక్షించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను తొలుత పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తణుకుకు తరలించారు.
శ్రీనివాస్‌తో పాటు కుమారుడు, కుమార్తె గల్లంతైనట్లు సమాచారం. వారి కోసం పోలీసులు, స్థానిక మత్స్యకారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులే ఘటనకు కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



