Saturday, 5 September 2026
  • Home  
  • గురువులకు సైకత శిల్పి సనత్ కళాభివందనం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గురువులకు సైకత శిల్పి సనత్ కళాభివందనం

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన ప్రముఖ సైకత శిల్పి సనత్ కుమార్ వినూత్న కళాఖండాన్ని రూపొందించారు. పుస్తకంపై డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రూపం ప్రతిబింబించేలా ఇసుకతో శిల్పాన్ని తీర్చిదిద్దారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల జీవితాలకు దిశానిర్దేశం చేసే గురువులకు కృతజ్ఞతగా ఈ కళారూపాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు. శిల్పం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. ఆయన ప్రతిభను పలువురు అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయమని పేర్కొంటూ, ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. Uploaded Video:

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన ప్రముఖ సైకత శిల్పి సనత్ కుమార్ వినూత్న కళాఖండాన్ని రూపొందించారు. పుస్తకంపై డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రూపం ప్రతిబింబించేలా ఇసుకతో శిల్పాన్ని తీర్చిదిద్దారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల జీవితాలకు దిశానిర్దేశం చేసే గురువులకు కృతజ్ఞతగా ఈ కళారూపాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు. శిల్పం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. ఆయన ప్రతిభను పలువురు అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయమని పేర్కొంటూ, ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.