సేవ సంకల్ప అభియాన్లో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహించనున్న వివిధ సేవా కార్యక్రమాలపై శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యశాల నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అభియాన్ నిర్వహణ, సేవా కార్యక్రమాలపై నాయకులు చర్చించారు. పాలేరు నియోజకవర్గ ఇంచార్జి నున్న రవికుమార్, జిల్లా నాయకులు గుత్త వెంకటేశ్వర్లు, సుబ్బారావు, ప్రవీణ్, సాయిరామ్, వీరం రాజు, మంద సరస్వతి తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.



