T.G : గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ప్రేమ జంట మిత్ర చైతన్య(21), హేమలత(20)లను ఖమ్మం జిల్లా వైరా క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఒడిశాలో రూ.16 వేలకు 12 కిలోల గంజాయి కొని, హైదరాబాద్‌లో రూ.6 లక్షలకు విక్రయించేందుకు వెళ్తుండగా పట్టుబడ్డారు.
ప్రియురాలి పుట్టినరోజుకు ఐఫోన్ కొనివ్వాలనే ఉద్దేశ్యంతో గంజాయి విక్రయిస్తున్నట్లు చైతన్య ఒప్పుకున్నాడు.
గంజాయి విక్రయించిన భగవాన్ హంతాల్, కొనుగోలు చేయాల్సిన శశి, నాగుల పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

