Friday, 4 September 2026
  • Home  
  • 25 ఏళ్ల ఆధ్యాత్మిక వారసత్వం.. శ్రీ పెద్ద దర్గా వీధి గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు*
- తిరుపతి

25 ఏళ్ల ఆధ్యాత్మిక వారసత్వం.. శ్రీ పెద్ద దర్గా వీధి గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు*

*నాయుడుపేటలో వెండితెరను తలపించేలా గణనాథుడి మండపం* – *బెంగాల్ కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకుంటున్న అద్భుత సినిమా సెట్టింగ్* – *ఆకట్టుకోనున్న హైదరాబాద్ భారీ గణపతి విగ్రహం: కమిటీ ప్రధాన నిర్వాహకులు ఎస్.జె. రాజేష్ వెల్లడి* తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోకవర్గ పరిధిలోని నాయుడుపేట పట్టణం ఆధ్యాత్మిక శోభతో అలారారుతోంది. రాబోయే వినాయక చవితి పండగను పురస్కరించుకుని నాయుడుపేటలోని ప్రముఖ శ్రీ పెద్ద దర్గా వీధి సెంటర్ లో ప్రతిష్టించే భారీ గణనాథుడి ఉత్సవాల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గత 25 ఏళ్లుగా నిరంతరాయంగా వినాయక ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ‘శ్రీ పెద్ద దర్గా వీధి గణపతి ఉత్సవ కమిటీ’ ఈ ఏడాది పాతికేళ్ల రజతోత్సవ సంబరాలను పురస్కరించుకుని మరింత ఘనంగా ఏర్పాట్లు చేపడుతోంది. *సినిమా సెట్టింగ్‌ను తలపించేలా మండపం* ఈ ఏడాది గణపయ్య మండపాన్ని వెండితెర సెట్టింగ్ తరహాలో అత్యంత ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన నిపుణులైన కళాకారులు గత కొన్ని రోజులుగా అహర్నిశలు శ్రమించి ఈ సినిమా సెట్టింగ్ మండపాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ భారీ మండపం నాయుడుపేట పట్టణంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. *హైదరాబాద్ నుంచి భారీ గణనాథుడు* మండపంలో ప్రతిష్టించే సుందరమైన, భారీ గణనాథుడి విగ్రహాన్ని భాగ్యనగరం హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో నాయుడుపేటకు తరలిస్తున్నారు. చవితి రోజున వైదిక పండితుల మంత్రోచ్ఛారణలు, శాస్త్రోక్త పూజాధికాల నడుమ గణపయ్యను ప్రతిష్టించి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. *ఎస్.జె. రాజేష్ నేతృత్వంలో వేగంగా ఏర్పాట్లు* ఈ ఆధ్యాత్మిక వేడుకలను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు సీనియర్ టిడిపి నాయకులు ఎస్.జె. రాజేష్ ముందుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో పాటు కమిటీ సభ్యులు భారత్ ఆటో సాయి కిషోర్, గోనుపల్లి గురుమూర్తి, బల్లి కుమార్, హంస పృథ్వీ ఆవుల సుధాకర్, బయ్యా రామారావు, బయ్యా రమేష్, దేవతా గోపి, శంకర్ లాల్, సొంటి రమేష్ తదితరులు శ్రమిస్తున్నారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధి ఎస్.జె. రాజేష్ మాట్లాడుతూ.. నాయుడుపేట పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల భక్తులందరూ విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి లంబోధరుడి కృపాకటాక్షాలు పొందాలని పిలుపునిచ్చారు.

*నాయుడుపేటలో వెండితెరను తలపించేలా గణనాథుడి మండపం*
– *బెంగాల్ కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకుంటున్న అద్భుత సినిమా సెట్టింగ్*

– *ఆకట్టుకోనున్న హైదరాబాద్ భారీ గణపతి విగ్రహం: కమిటీ ప్రధాన నిర్వాహకులు ఎస్.జె. రాజేష్ వెల్లడి*

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోకవర్గ పరిధిలోని నాయుడుపేట పట్టణం ఆధ్యాత్మిక శోభతో అలారారుతోంది. రాబోయే వినాయక చవితి పండగను పురస్కరించుకుని నాయుడుపేటలోని ప్రముఖ శ్రీ పెద్ద దర్గా వీధి సెంటర్ లో ప్రతిష్టించే భారీ గణనాథుడి ఉత్సవాల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గత 25 ఏళ్లుగా నిరంతరాయంగా వినాయక ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ‘శ్రీ పెద్ద దర్గా వీధి గణపతి ఉత్సవ కమిటీ’ ఈ ఏడాది పాతికేళ్ల రజతోత్సవ సంబరాలను పురస్కరించుకుని మరింత ఘనంగా ఏర్పాట్లు చేపడుతోంది.

*సినిమా సెట్టింగ్‌ను తలపించేలా మండపం*

ఈ ఏడాది గణపయ్య మండపాన్ని వెండితెర సెట్టింగ్ తరహాలో అత్యంత ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన నిపుణులైన కళాకారులు గత కొన్ని రోజులుగా అహర్నిశలు శ్రమించి ఈ సినిమా సెట్టింగ్ మండపాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ భారీ మండపం నాయుడుపేట పట్టణంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

*హైదరాబాద్ నుంచి భారీ గణనాథుడు*

మండపంలో ప్రతిష్టించే సుందరమైన, భారీ గణనాథుడి విగ్రహాన్ని భాగ్యనగరం హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో నాయుడుపేటకు తరలిస్తున్నారు. చవితి రోజున వైదిక పండితుల మంత్రోచ్ఛారణలు, శాస్త్రోక్త పూజాధికాల నడుమ గణపయ్యను ప్రతిష్టించి ఉత్సవాలను ప్రారంభించనున్నారు.

*ఎస్.జె. రాజేష్ నేతృత్వంలో వేగంగా ఏర్పాట్లు*

ఈ ఆధ్యాత్మిక వేడుకలను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు సీనియర్ టిడిపి నాయకులు ఎస్.జె. రాజేష్ ముందుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో పాటు కమిటీ సభ్యులు భారత్ ఆటో సాయి కిషోర్, గోనుపల్లి గురుమూర్తి, బల్లి కుమార్, హంస పృథ్వీ ఆవుల సుధాకర్, బయ్యా రామారావు, బయ్యా రమేష్, దేవతా గోపి, శంకర్ లాల్, సొంటి రమేష్ తదితరులు శ్రమిస్తున్నారు.
ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధి ఎస్.జె. రాజేష్ మాట్లాడుతూ.. నాయుడుపేట పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల భక్తులందరూ విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి లంబోధరుడి కృపాకటాక్షాలు పొందాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.