*ఇరువురు పేద వధువులకు మంగళసూత్రములు అందజేత*
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 3 వాకాడు మండలం,*
తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు, సంస్థ వ్యవస్థాపకులు రామిరెడ్డి వేంకటరామిరెడ్డి,హైమావతమ్మ దంపతుల ఆర్థిక సౌజన్యంతో ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద అర్చక,పురోహిత కుటుంబాలకు చెందిన ఇరువురు వధువులకు ఒక లక్ష రూపాయల విలువ చేసే మంగళ సూత్రములు,పసుపు,కుంకుమ,చీర,సారెలకు రొక్కమును ఆలయ ధర్మకర్తలు సొసైటీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదరరెడ్డి ఆన్లైన్ ద్వారా అందించారు.ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ వైవాహిక క్రతువులో అత్యంత ప్రధానమైన మంగళసూత్రం,పసుపు,కుంకుమ,చీర,సారెలను అర్చక,పురోహిత కుటుంబాలలో పేదలైన వధువులకు ఒక్కొక్కరికి 50 వేల రూపాయల చొప్పున ఒక లక్ష రూపాయలను అందించడం సంతోషకరమని ఈ సందర్భంగా దాతలను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు.కార్యక్రమంలో శ్రీరామసేన అధ్యక్షులు హరీష్ రెడ్డి,వంశీ,దినేష్,హరీష్, ఆలయ ప్రధాన అర్చకులు,సంస్థ ప్రతినిధి దీవి అనంతాచార్యులు తదితరులు పాల్గొన్నారు.*



