డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా..అంబాజీపేట మండలం కె.పెదపూడిలో ఈ నెల 9న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా చేపట్టబోయే బహిరంగ సభ, హెలిప్యాడ్ స్థలాల కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా,పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణలు గురువారం పలు ప్రాంతాలను పరిశీలించారు.మాచవరం పండువారిపేట,కె.పెదపూడి ఓఎన్జిసి సైట్, ఇరుసుమండ లేఅవుట్లను పరిశీలించారు. రాజముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ పుస్తకాలను సీఎం చేతుల మీదుగా రైతులకు అందజేస్తారని తెలిపారు. వారి వెంట కొత్తపేట ఆర్డీవో జివివి సత్యనారాయణ, డిఎస్పి సుంకర మురళీమోహన్రావు, వివిధ శాఖల అధికారులు, కూటమి శ్రేణులు ఉన్నారు.



