కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 3:*
జగ్గంపేట టౌన్ లో ముఖ్యమంత్రి సహాయనిధి కింద 10 మందికి 7 లక్షల 84 వేల 639 రూపాయల విలువైన చెక్కులను గురువారం మోటారు బైక్ పై ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ హాజరై 10 మంది ఇళ్లకు స్వయంగా వెళ్లి ప్రభుత్వం నుంచి వచ్చిన చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు.అలాగే సింహాద్రిపురం గ్రామానికి చెందిన సోడిశెట్టి సత్యనారాయణకి బ్రెయిన్ ఆపరేషన్ నిమిత్తం 2 లక్షల 74వేల రూపాయల ఎల్ఓసి ముందస్తు లెటర్ ను రావులమ్మ నగర్ లోని పార్టీ కార్యాలయంలో వారికి అందజేశారు.ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ…
అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకోలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు వరంగా మారాయని అన్నారు.జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ కులం, మతం, పార్టీల భేదాలు లేకుండా అనారోగ్యంతో వైద్యం చేయించుకున్న ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందిస్తున్నామని తెలిపారు.గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరుకే పరిమితమైందని, పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చొరవతో సీఎం సహాయనిధి ద్వారా నేరుగా లబ్ధి చేకూరుస్తున్నామని అన్నారు.ప్రజలకు అండగా ఉండటమే జ్యోతుల నెహ్రూ లక్ష్యమని, ఎవరూ అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి వెళ్లి మరీ చెక్కులు అందిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, వేములకొండ జోగారావు, ఎస్ ఏ గఫూర్, రాయి సాయి, పీలా మహేష్, వైబోగుల కొండబాబు యాదవ్, నేదూరి గణేష్, దుర్గపు ప్రకాష్, సాంబతుల చంద్రశేఖర్, నలమాటి ఆనంద్, చెలికాని హరి గోపాల్, ఎండి కాజా, డేగల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.


