జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పార్టీ నాయకుడు దండి నరేంద్ర ఆధ్వర్యంలో పలు సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలను మిన్నంటగా నిర్వహించారు. ఈ సందర్భంగా దండి నరేంద్ర మాట్లాడుతూ, నియోజకవర్గవ్యాప్తంగా జనసైనికులు చూపించిన అపారమైన ప్రేమ, ఆప్యాయత ఎంతో సంతోషాన్ని కలిగించాయని, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు. వేడుకల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలు, దృఢమైన నాయకత్వం కోసం ప్రత్యేక రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేపట్టారు. ముచ్చివోలు నుంచి రేణిగుంట వరకు సుమారు 200 బైకులతో 78 కిలోమీటర్ల మేర భారీ బైక్ ర్యాలీ నిర్వహించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పార్టీ సందేశాన్ని చాటారు. కరకంబాడిలో పార్టీ జెండాను ఆవిష్కరించడంతో పాటు భారీ ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ‘జై కొట్టు’ కార్యక్రమాన్ని శ్రేణులతో కలిసి వీక్షించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా అనాథాశ్రమంలోని 70 మందికి, పట్టణంలో మరో 500 మందికి అన్నదానం చేపట్టారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేయగా, కందాడు పంచాయతీ పరిధిలో రహదారుల వెంట మొక్కలు నాటారు. రేణిగుంట, కందాడు, బి.పి. అగ్రహారం, ముచ్చివోలు, అమందూరు, మద్దిలేడు, వాగవేడు, సూరవారిపల్లె, విప్పమనపట్టెడ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన కేక్ కటింగ్ వేడుకల్లో దండి నరేంద్ర పాల్గొని జనసైనికుల్లో ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమాలను జయప్రదం చేసిన జనసైనికులకు, నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

పవన్ కళ్యాణ్ జన్మదినాన శ్రీకాళహస్తిలో సేవా కార్యక్రమాల జాతర