తిరుచానూరు, సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని పలువురు ప్రముఖులు వేరేవేరు సమయంలో దర్శించుకున్నారు. ప్రముఖులలో మాజీ గవర్నర్ నరసింహన్, ఎస్బిఐ చైర్మన్ చల్లా శ్రీనివాస్ శెట్టిలు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, సూపరింటెండెంట్ సురేష్, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.



