నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి )
మనుబోలు: దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా మనుబోలు బైపాస్ సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ అందించిన ప్రజాసేవలను, పేదల సంక్షేమం కోసం అమలు చేసిన పలు కార్యక్రమాలను నాయకులు స్మరించుకున్నారు. పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వైఎస్సార్ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండలానికి చెందిన పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళులు
నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి ) మనుబోలు: దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా మనుబోలు బైపాస్ సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ అందించిన ప్రజాసేవలను, పేదల సంక్షేమం కోసం అమలు చేసిన పలు కార్యక్రమాలను నాయకులు స్మరించుకున్నారు. పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వైఎస్సార్ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండలానికి చెందిన పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

