*వై.యస్.ఆర్ గారి వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం.*
*ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి కుటుంబం ఆనాటి ముఖ్యమంత్రి వై.యస్.ఆర్ గారిని తమ కుటుంబ సభ్యుడిగా భావించారు.*
*వై.యస్.ఆర్ బాటలోనే మన జగనన్న పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేశారు.*
*- మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు.*
ది.02/09.
మైలవరం/ఎన్టీఆర్ జిల్లా – నియోజకవర్గ కేంద్రమైన మైలవరం పట్టణంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించిన మైలవరం పట్టణ మరియు మండల పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక L.H కాంప్లెక్స్, మూడు బొమ్మల సెంటర్ వద్ద వై.యస్.ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన
*మాజీ మంత్రివర్యులు,*
*మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త*
*శ్రీ జోగి రమేష్ గారు.* మరియు స్థానిక పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు.
అనంతరం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, మీడియాతో మాట్లాడిన జోగి రమేష్ గారు.



