అచ్చంపేట పట్టణంలోని శాలెం చర్చిని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కడు వంశీకృష్ణ సందర్శించారు. పాస్టర్‌తో మాట్లాడి చర్చి, క్రైస్తవ సంఘం సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చర్చి అభివృద్ధి, సామాజిక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే నిధుల నుంచి సహకరిస్తానని హామీ ఇచ్చారు. సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. అచ్చంపేట నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు చేయాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ అంతటి రజిత మల్లేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


