Wednesday, 2 September 2026
  • Home  
  • శభాష్ సాయి చరణ్.. హెచ్‌పీసీఎల్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపిక
- మేడ్చల్ – మల్కాజిగిరి

శభాష్ సాయి చరణ్.. హెచ్‌పీసీఎల్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపిక

పున్నమి: రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం,జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీకి చెందిన చిలుకల సాయి చరణ్ హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికై కాలనీకి గర్వకారణంగా నిలిచాడు. బ్లాక్ నంబర్ 38లో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న సాయి చరణ్‌ది నిరుపేద కుటుంబం. తండ్రి సందీప్ కుమార్ క్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన సాయి చరణ్, ప్రస్తుతం మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. హెచ్‌పీసీఎల్ నియామక ప్రక్రియలో అత్యుత్తమ ర్యాంక్ సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. శిక్షణ నిమిత్తం భువనేశ్వర్‌కు వెళ్తున్న సందర్భంగా సురక్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిక్కర గోపీ శంకర్ యాదవ్ సురక్ష కార్యాలయంలో సాయి చరణ్‌ను ఘనంగా సన్మానించారు. తన విజయానికి గోపీ శంకర్ యాదవ్ మార్గదర్శకత్వం ఎంతో ఉపయోగపడిందని సాయి చరణ్ తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ యువత సాయి చరణ్‌ను ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని గోపీ శంకర్ యాదవ్ కోరారు. కార్యక్రమంలో సురక్ష సభ్యులు యాకూబ్, సందీప్ కుమార్ పాల్గొన్నారు.

పున్నమి: రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం,జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీకి చెందిన చిలుకల సాయి చరణ్ హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికై కాలనీకి గర్వకారణంగా నిలిచాడు.

బ్లాక్ నంబర్ 38లో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న సాయి చరణ్‌ది నిరుపేద కుటుంబం. తండ్రి సందీప్ కుమార్ క్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన సాయి చరణ్, ప్రస్తుతం మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. హెచ్‌పీసీఎల్ నియామక ప్రక్రియలో అత్యుత్తమ ర్యాంక్ సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యాడు.

శిక్షణ నిమిత్తం భువనేశ్వర్‌కు వెళ్తున్న సందర్భంగా సురక్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిక్కర గోపీ శంకర్ యాదవ్ సురక్ష కార్యాలయంలో సాయి చరణ్‌ను ఘనంగా సన్మానించారు. తన విజయానికి గోపీ శంకర్ యాదవ్ మార్గదర్శకత్వం ఎంతో ఉపయోగపడిందని సాయి చరణ్ తెలిపారు.

ఈ సందర్భంగా కాలనీ యువత సాయి చరణ్‌ను ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని గోపీ శంకర్ యాదవ్ కోరారు. కార్యక్రమంలో సురక్ష సభ్యులు యాకూబ్, సందీప్ కుమార్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.