Tuesday, 8 September 2026
  • Home  
  • 13 మంది వితంతువులకు నూతనంగా పెన్షన్లు
- తూర్పు గోదావరి

13 మంది వితంతువులకు నూతనంగా పెన్షన్లు

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి పెడపర్తి, సెప్టెంబరు 1 (పున్నమి ప్రతినిధి): ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అనపర్తి మండలానికి నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లను 13 మంది లబ్ధిదారులకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు. పెడపర్తి పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, కూటమి నాయకులను కోరారు. ఈ నెలలో నూతనంగా మంజూరయ్యే పెన్షన్లకు సంబంధించి ప్రక్రియను ప్రారంభించి, అర్హులకు పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల, పెడపర్తి గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి

పెడపర్తి, సెప్టెంబరు 1 (పున్నమి ప్రతినిధి):
ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అనపర్తి మండలానికి నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లను 13 మంది లబ్ధిదారులకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు.

పెడపర్తి పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, కూటమి నాయకులను కోరారు. ఈ నెలలో నూతనంగా మంజూరయ్యే పెన్షన్లకు సంబంధించి ప్రక్రియను ప్రారంభించి, అర్హులకు పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అనపర్తి మండల, పెడపర్తి గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.