Tuesday, 1 September 2026
  • Home  
  • ఆదివాసీ బిడ్డ మృతికి కొవ్వొత్తుల ర్యాలీ )…
- BHADRADRI

ఆదివాసీ బిడ్డ మృతికి కొవ్వొత్తుల ర్యాలీ )…

కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 1:(పున్నమి ప్రతినిధి ):: ములకలపల్లి మండలం చవిటిగూడెం గ్రామ ఆదివాసీ బిడ్డ శిరీష మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని బూర్గంప‌హాడ్‌ మండల పరిధిలోని పోలవరం గ్రామానికి చెందిన ఆదివాసీలు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం రాత్రి శిరీష మృతికి సంతాపంగా మాజీ జడ్పీటీసీ బట్టా విజయ్ంధీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ ఆస్ప‌త్రిలో వైద్య సహాయకురాలిగా నిరంతరం సేవలందించే నర్సు శిరీషను హత్య చేసిన వారిని వదలొద్దని, ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపించి కారకులకు కఠినశిక్ష పడేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. శిరీష పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 1:(పున్నమి ప్రతినిధి )::
ములకలపల్లి మండలం చవిటిగూడెం గ్రామ ఆదివాసీ బిడ్డ శిరీష మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని బూర్గంప‌హాడ్‌ మండల పరిధిలోని పోలవరం గ్రామానికి చెందిన ఆదివాసీలు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం రాత్రి శిరీష మృతికి సంతాపంగా మాజీ జడ్పీటీసీ బట్టా విజయ్ంధీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ ఆస్ప‌త్రిలో వైద్య సహాయకురాలిగా నిరంతరం సేవలందించే నర్సు శిరీషను హత్య చేసిన వారిని వదలొద్దని, ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపించి కారకులకు కఠినశిక్ష పడేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. శిరీష పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.