Monday, 31 August 2026
  • Home  
  • శ్రీ కందులవారిపల్లి లో స్వర్ణ గ్రామం కార్యక్రమం ప్రారంభం
- తిరుపతి

శ్రీ కందులవారిపల్లి లో స్వర్ణ గ్రామం కార్యక్రమం ప్రారంభం

మండలంలోని సి.కందులవారిపల్లిలో ప్రజలకు అవసరమైన వైద్య, పరిపాలనా సేవలను మరింత చేరువ చేసేందుకు నిర్మించిన రెండు కీలక భవనాలు సోమవారం అందుబాటులోకి వచ్చాయి. రూ.36 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం, రూ.32 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. బాలు రామాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కస్తూరి విశ్వనాథ నాయుడు, కేకే చౌదరి, విశ్వేశ్వర నాయుడు తదితరులతో కలిసి రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక వసతులు, ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండటం ఎంతో ముఖ్యమన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా గ్రామంలోనే ప్రాథమిక వైద్యం, ఆరోగ్య పరీక్షలు, వైద్య సలహాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. చిన్నచిన్న అనారోగ్య సమస్యల కోసం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందన్నారు. నూతన పంచాయతీ భవనం అందుబాటులోకి రావడంతో గ్రామ పరిపాలన మరింత సౌకర్యవంతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించడంలో పంచాయతీ వ్యవస్థ కీలకమని అన్నారు. కార్యక్రమంలో లారీ సుబ్బరాయుడు, కాకర్ల నాగార్జున, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మండలంలోని సి.కందులవారిపల్లిలో ప్రజలకు అవసరమైన వైద్య, పరిపాలనా సేవలను మరింత చేరువ చేసేందుకు నిర్మించిన రెండు కీలక భవనాలు సోమవారం అందుబాటులోకి వచ్చాయి. రూ.36 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం, రూ.32 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.
బాలు రామాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కస్తూరి విశ్వనాథ నాయుడు, కేకే చౌదరి, విశ్వేశ్వర నాయుడు తదితరులతో కలిసి రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి భవనాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక వసతులు, ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండటం ఎంతో ముఖ్యమన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా గ్రామంలోనే ప్రాథమిక వైద్యం, ఆరోగ్య పరీక్షలు, వైద్య సలహాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. చిన్నచిన్న అనారోగ్య సమస్యల కోసం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందన్నారు.
నూతన పంచాయతీ భవనం అందుబాటులోకి రావడంతో గ్రామ పరిపాలన మరింత సౌకర్యవంతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించడంలో పంచాయతీ వ్యవస్థ కీలకమని అన్నారు.
కార్యక్రమంలో లారీ సుబ్బరాయుడు, కాకర్ల నాగార్జున, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.