ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన పుట్టినరోజు, వేడుకలలో భాగంగా!.. ఆదివారం వెంకటగిరి ప్రభుత్వ వైద్యశాల నందు మెగా రక్తదాన శిబిరం, జనసేన పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు, వెంకటగిరి నియోజకవర్గ 100 వందల సంఖ్యలో రక్తదాతలు స్వచ్ఛందంగా పాల్గొని రక్త దాన కార్యక్రమం విజయవంతం చేశారు,
ఈ కార్యక్రమానికి రక్తదాతలు, మెగా అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వెంకటగిరి జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామారావు అనిల్ కుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీ పలు సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందు ఉంటుందని, ఈరోజు జరిగిన రక్తదాన కార్యక్రమంలో వందలాదిగా యువత పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉందని వారి అందరి ఆశీస్సులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి తప్పకుండా ఉంటుందని తెలిపారు.
అలాగే రేపటి నుంచి మూడు రోజులు పలు సేవా కార్యక్రమాలు జరుగుతున్నట్టు తెలియజేశారు,
అందులో భాగంగా 31 తేదీ,పర్యావరణం పకృతిని కాపాడే దిశగా మొక్కలు నాటే కార్యక్రమం.
ఒకటవ తేదీ ప్రభుత్వ వైద్యశాల నందు రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం,
రెండవ తేదీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా స్థానిక అన్న క్యాంటీన్ నందు పేదవారికి ఉచిత భోజన కార్యక్రమం తో పాటు బారి కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నట్లు మీడియాకు తెలియజేశారు.



