ఖమ్మం జిల్లాలో ఆరేళ్లకు పైగా బీసీ సంక్షేమ శాఖలో సేవలందించిన జిల్లా బీసీ సంక్షేమ అధికారి గుడికందుల జ్యోతికి పదోన్నతి లభించింది. ఆమెకు డిప్యూటీ డైరెక్టర్ హోదా కల్పిస్తూ బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాల మాయాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్యాభివృద్ధి, సంక్షేమం కోసం జ్యోతి ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ముఖ్యంగా విద్యార్థులకు ఉచిత కోచింగ్‌తో పాటు అవసరమైన ఇతర సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేశారు. శాఖలో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ విద్యార్థులు, బీసీ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. పదోన్నతి పొందిన గుడికందుల జ్యోతికి పలువురు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.



