భూపాలపల్లి : 2026-27 సంవత్సరానికి సంబంధించి వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ (WPS&GA) ఆధ్వర్యంలో భూపాలపల్లి ఏరియాలో డిపార్ట్మెంటల్ క్రీడా పోటీలు సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్నట్లు ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యామ్ సుందర్ ప్రకటించారు. కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్, హాకీ, క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, ఫుట్బాల్, లాన్ టెన్నిస్, బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ తదితర క్రీడలు వివిధ తేదీలలో జరగనున్నాయి.
సెప్టెంబర్ 16, 17 తేదీల్లో క్రికెట్, 20, 21 తేదీల్లో షటిల్ బ్యాడ్మింటన్, త్రోబాల్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్ పోటీలను నిర్వహిస్తారు. క్రీడల కోసం టీమ్లను మూడు గ్రూపులుగా విభజించారు: గ్రూప్ A, B, C. సెప్టెంబర్ 27న సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహణలో ఉంటాయని తెలిపారు. పోటీలన్నీ స్థానిక కృష్ణ కాలనీ ఆంబేద్కర్ స్టేడియంలో ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతాయని, సంబంధిత ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొనాలని ఎస్. శ్యామ్ సుందర్ కోరారు.


