పుట్టపర్తి, ఆగస్టు,29:
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (ఆంధ్రప్రదేశ్) ఆధ్వర్యంలో తిరుపతిలో ఆగస్టు 24 నుండి 27 వరకు నిర్వహించిన “అమరావతి ఛాంపియన్ షిప్ – 2026” రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో శ్రీ సత్యసాయి జిల్లా క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి మొత్తం 7 పతకాలను సాధించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి విచ్చేసిన క్రీడాకారులు 12 రకాల క్రీడాంశాల్లో పోటీపడగా, శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ప్రతిభావంతులు క్రింది విభాగాల్లో విజేతలుగా నిలిచారు.యోగా (అండర్-17 బాలురు): ఎమ్. అశోక్ కుమార్ – మొదటి స్థానం (స్వర్ణ పతకం),హాకీ (అండర్-17 బాలికల జట్టు): ప్రథమ స్థానం (స్వర్ణ పతకం)యోగా (అండర్-23 బాలికలు): ఏ. కుమారి – రెండవ స్థానం (రజత పతకం),బాక్సింగ్ (అండర్-17 బాలికలు): సనా సుల్తానా – రెండవ స్థానం (రజత పతకం),హాకీ (అండర్-23 బాలుర జట్టు): రెండవ స్థానం (రజత పతకం),వాలీబాల్ (అండర్-17 బాలుర జట్టు): రెండవ స్థానం (రజత పతకం),కబడ్డీ (అండర్-17 బాలికల జట్టు): రెండవ స్థానం (రజత పతకం),రాష్ట్ర స్థాయిలో జిల్లా పేరును నిలబెట్టి 7 పతకాలు సాధించిన క్రీడాకారులను, వారి శిక్షకులను జిల్లా యంత్రాంగం మరియు క్రీడాభిమానులు ప్రత్యేకంగా అభినందించారు.


