డిమాండ్ల సాధనకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
ఆత్మకూరు, ఆగస్టు 28 (పున్నమి ప్రతినిధి): ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షను రద్దు చేయాలని, ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఆధ్వర్యంలో ఆత్మకూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ఆత్మకూరులోని యూటీఎఫ్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ సత్రం సెంటర్, బస్టాండ్ మీదుగా ఎమ్మార్వో కార్యాలయం వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ అసంబద్ధమైన టెట్ పరీక్షను స్వచ్ఛందంగా రద్దు చేయాలని, ఎలిజిబిలిటీ మార్కులను అన్ని సామాజిక వర్గాలకు ఒకే విధంగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఏ సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయులకు ఆ సబ్జెక్టులో మాత్రమే టెట్ పరీక్ష నిర్వహించాలని కోరారు. టెట్ పరీక్షల రద్దుపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ బైక్ ర్యాలీలో జిల్లా కార్యదర్శి ఎం. గంగాధర్, మాజీ జిల్లా కార్యదర్శి మోహన్ ప్రసాద్ (రిటైర్డ్), రాష్ట్ర కౌన్సిలర్ వి. మల్లికార్జున్, ఆత్మకూరు అధ్యక్షులు ఎస్.కె. ఖాదర్‌బాషా, ప్రధాన కార్యదర్శి మోహన్‌రావు, హరికృష్ణ, బి. శివప్రసాద్‌రావు, పి. సుధాకర్‌రావు, ఏఎస్‌పేట మండల అధ్యక్షులు వెంకట్రాజా, మర్రిపాడు మండల యూటీఎఫ్ సీనియర్ నాయకులు కటారి సుధాకర్‌తో పాటు ఆత్మకూరులోని సీనియర్ యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.


