ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ APPTD ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ పిలుపు మేరకు గురువారం ఉదయగిరి ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. మొదటి సర్వీస్ నుంచే ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. మధ్యాహ్నం గేట్ మీటింగ్ నిర్వహించి సమస్యలపై చర్చించనున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వారు కోరారు. నిరసన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఉదయగిరిలో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన