వింజమూరు పట్టణంలోని ఓ గ్యాస్ గోడౌన్ సమీపంలో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా అక్కడ పేరుకుపోయిన చెత్తకు మంటలు అంటుకున్నట్లు సమాచారం. క్షణాల్లో మంటలు పెద్దఎత్తున వ్యాపించడంతో పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ ఘటనలో స్క్రాప్ సామగ్రి, పలు పరికరాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. గ్యాస్ గోడౌన్‌కు సమీపంలోనే మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

వింజమూరు: గ్యాస్ గోడౌన్ సమీపంలో అగ్నిప్రమాదం