Friday, 28 August 2026
  • Home  
  • తైక్వాండో విజేతలకు డాక్టర్ రవికృష్ణ అభినందనలు
- నంద్యాల

తైక్వాండో విజేతలకు డాక్టర్ రవికృష్ణ అభినందనలు

నంద్యాల:రాయలసీమ జోనల్ స్థాయి తైక్వాండో పోటీల్లో పతకాలు సాధించిన నంద్యాల క్రీడాకారులను లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ఉమ్మడి కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ మంగళవారం అభినందించారు.నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించిన ఈ పోటీల్లో స్థానిక క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచారు. కోచ్‌లు సర్దార్, షానవాజ్ శిక్షణలోని క్రీడాకారులు 4 స్వర్ణ, 8 రజత, 5 కాంస్య పతకాలు సాధించగా… కోచ్ బాలకృష్ణ శిక్షణలోని క్రీడాకారులు 5 స్వర్ణ, 3 రజత, 3 కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు.ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ… క్రీడల్లో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి నిరంతర సాధన, అంకితభావం అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా బాలికలకు తైక్వాండో వంటి ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ ఇవ్వడం ఎంతో అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో కోచ్‌లు, సుధాకర్ రెడ్డి, క్రీడాకారులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.