పద్యాల తోరణం కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం
పద్యము తెలుగు భాషకు
హృద్యం
జిల్లా స్థాయి తెలుగు పద్యాల తోరణంకు ఉపాధ్యాయులంతా సహకరించాలి: ఆర్ యు పి పి టి ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గోపాల్ జి పిలుపు
రంగారెడ్డి, ఆగస్టు 25:
రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అనుమతితో సెప్టెంబర్ మూడవ వారంలో నిర్వహించనున్న జిల్లా స్థాయి “పద్యాల తోరణం” కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు తెలుగు ఉపాధ్యాయులు, సాహితీ ప్రియులు, విద్యాభిమానులు సంపూర్ణ సహకారం అందించాలని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు–తెలంగాణ (ఆర్ యు పి పి టి ఎస్) రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కళ్యాణ్ కార్ గోపాల్ జి పిలుపునిచ్చారు. మంగళ వారం నాడు తుక్కుగూడ
కొత్తూరు తదితర ప్రాంతాల్లో జరిగిన సాహితీ కార్యక్రమాలలో గోపాల్ జి మాట్లాడుతూ
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థు ల లో సాహితి వైభవాన్ని తీసుకురావడానికి
రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు–రంగారెడ్డి జిల్లా శాఖ, అనంత సాహితీ–సాంస్కృతిక వేదిక సంపూర్ణ సహకారంతో, జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భవిష్యత్ తరాలకు తెలుగు భాష, సాహిత్యం, పద్య సంపద యొక్క ఔన్నత్యాన్ని పరిచయం చేయాలనే లక్ష్యంతో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించేందుకు కార్యక్రమాన్ని రూపొందించినట్లు కె గోపాల్ జి పేర్కొన్నారు.
‘పద్యతోరణం’ పుస్తకాల పంపిణీ :–
పెద్దలు కందాడై రంగరాజు గారు సంకలనం చేసిన “పద్యతోరణం” పుస్తకాన్ని జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ సదా వెంకటరెడ్డి గారి సంకల్పానికి బాసటగా నిలుస్తూ వెయ్యి ప్రతులను ముద్రించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి తెలుగు ఉపాధ్యాయుడికి ఈ పుస్తకాలను అందించి, విద్యార్థుల్లో పద్యధారణపై ఆసక్తిని పెంపొందించేందుకు చర్యలు చేపట్టినట్లు గోపాల్ జి తెలిపారు.
స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల ద్వారా విస్తృత ప్రచారం
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను వేదికగా చేసుకొని పద్యాల తోరణం పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని., ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి పండిత పరిషత్ గౌరవ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి లు మాట్లాడుతూ జిల్లాలోని సాహిత్య అభిమానులు తెలుగు భాషా బోధకులు జిల్లాలోని కవులు కళాకారుల సంపూర్ణ సహకారంతో, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ అధ్యక్షులు సదా వెంకట్ రెడ్డి అనంత సాహితీ వేదిక అధ్యక్షులు సాహితివేత్త దొరవేటి చెన్నయ్య ఆర్ యు పి పి టి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు శానమోని నర్సింహులు పద్యాల తోరణం పుస్తక సంకలనకర్త రంగరాజు ల సహకారంతో రాష్ట్రస్థాయిలో జిల్లా స్థాయిలో పద్య పఠన కార్యక్రమాన్ని పండుగ వలె నిర్వహించనున్నట్లుగా వారు వివరించారు
కార్యక్రమ విజయానికి స్వచ్ఛందంగా బాధ్యతలు స్వీకరించి ముందుకు వచ్చిన డి ఆర్ పి బృందానికి భాషా పండిత పరిషత్ జిల్లా శాఖ ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న కిషన్ చౌహన్, పెండేం వెంకటేష్, మల్లికార్జున్, కుమార్, రాములు, నారాయణ తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పద్యధారణతో విద్యార్థులకు అనేక ప్రయోజనాలు
పుస్తకాల పంపిణీతో పాటు తెలుగు సాహిత్యం, ముఖ్యంగా పద్య సాహిత్యం యొక్క ప్రాధాన్యతను, పద్యధారణ వల్ల విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి, భాషా నైపుణ్యం, ఉచ్చారణ, భావవ్యక్తీకరణ, సాహిత్యాభిరుచి పెంపొందే విధానాన్ని ఉపాధ్యాయులకు వివరించారు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా ప్రతి ఉపాధ్యాయుడు కార్యక్రమంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
మండలాల వారీగా బాధ్యతలు – సమష్టి కృషికి పిలుపు
ఇప్పటికే పలు దఫాలుగా అంతర్జాల సమావేశాలు నిర్వహించి మండలాల వారీగా బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆశీర్వాదం, వీర మల్లేష్, నందిగామ కిషోర్, చుక్క శ్రీనివాస్, విజయ్ ప్రతాప్ రెడ్డి, వెంకట్ రెడ్డి, యాదయ్య, కల్లేష్, మహేందర్, రాములు, శంకరయ్య, రాజేష్, వెంకటేష్, గోవర్ధన్, వెంకటయ్య,జగన్, భువనేశ్వరి, చైతన్య భారతి, రమాదేవి, వరలక్ష్మి, కవిత, వసంతలక్ష్మి, మంజుల, శ్రీలత, పద్మజ తదితరులు వివిధ బాధ్యతలు స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.


